వరంగల్ అర్బన్ కలెక్టర్ గా పనిచేస్తున్న యంగ్ కలెక్టర్ అమ్రపాలి గుర్తున్నారు కదా? ఉత్సాహభరితమైన చర్యల్లో ముందుంటారనే సంగతి తెలిసిందే. గతంలో బాహుబలి-2 సినిమా విడుదల అయినప్పుడు తన సొంత డబ్బులతో ఉద్యోగస్తులందరికీ టికెట్లు కొనిచ్చి స్వయంగా వారితో కలిసి సినిమా చూసిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అలాగే మరో ఆసక్తికరమైన చర్యకు శ్రీకారం చుట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన సందర్భంగా వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి హల్ చల్ చేశారు.
జయశంకర్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా కలెక్టర్ అమ్రపాలి రాక్ క్లైంబింగ్ ఫెస్టివల్ ను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం రేగొండ మండలం లోని పాండవుల గుట్టను అమ్రపాలి ఎక్కారు. ఆమెతో పాటు అర్బన్ డీఎఫ్ఓ అర్పణ జయశంకర్ - డీఎఫ్ ఓ రవికిరణ్ సైతం కొండలు ఎక్కారు. కలెక్టరమ్మ ఉత్సాహంగా కొండలు ఎక్కుతూ ఉండటంతో మిగతా వారు సందడిగా కలెక్టరమ్మ హల్ చల్ చేశారు. కాగా కొద్దికాలం క్రితం సైతం ఇదే రీతిలో హల్‌చల్ చేశారు. అడవిలో ఉన్న చెరువును సందర్శించేందుకు మహబూబాబాద్ కలెక్టరమ్మ ప్రీతీమీనా కలిసి అమ్రపాలి అడవిలో ఏకంగా పన్నెండు కిలోమీటర్లు ఏకబిగిన నడిచి చెరువును సందర్శించారు. పెద్ద గుట్ట ఇనుప ఖనిజం టూరిజం ప్రాంతాన్ని కూడా సందర్శించారు.