వైసీపీకి క్రిస్టియ‌న్ల సంఘాల వార్నింగ్

Update: 2021-09-30 16:30 GMT
ఏపీలో క్రిస్టియ‌న్లు.. వైసీపీకి దూర‌మ‌వుతున్నారా? వారిలో అంత‌ర్గ‌త అస‌హ‌నం.. పెరిగిపోతోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక్క‌డ క్రిస్టియ‌న్లు అంటే.. ఆది నుంచి క్రైస్త‌వంలో ఉన్న‌వారు.. లేదా.. మ‌ధ్య‌లో మతం పుచ్చుకున్న‌వారు. వీరిలో అన్ని సామాజిక‌వ ర్గాలకు చెందిన వారు ఉన్నారు. అయితే.. ఇప్పుడు వీరంతా వైసీపీపై స‌మ‌ర శంఖం పూరిస్తున్నారు. వాస్త‌వానికి వైసీపీ రెండున్న‌రేళ్ల పాల‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఏనాడూ.. క్రిస్టియ‌న్లు.. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా.. చిన్న మాట మాట్లాడింది లేదు. అస‌హ‌నం వ్య‌క్తం చేసింది కూడా లేదు.

కానీ, ఇప్పుడు మాత్రం నోరు విప్పుతున్నారు. వైసీపీకి వ్య‌తిరేకంగా నిన‌దిస్తున్నారు. త్వ‌ర‌లోనే త‌మ త‌డా ఖా చూపిస్తామ‌ని కూడా అంటున్నారు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు? అనే ప్ర‌శ్న రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిగా మారింది. వావ‌స్త‌వానికి వైసీపీ స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత‌.. చ‌ర్చి పాస్ట‌ర్ల‌కు.. నెల‌నెల రూ.5000 చొప్పున‌ పారితోషికాలు ఇస్తోంది. ప‌లు జిల్లాల్లో చ‌ర్చిల నిర్మాణానికి.. స్థ‌లాల‌ను కేటాయిస్తోంది. ప‌లు ప్ర‌భుత్వ ప‌థ‌కాల్లో వారికి ల‌బ్ధి చేకూర్చ‌తోంది. ఇలా ఏదైనా.. కూడా వైసీపీ ప్ర‌భుత్వంపై ఇప్ప‌టి వ‌ర‌కు క్రిస్టియ‌న్లకు అనేక రూపాల్లో మేళ్లు చేస్తోంది. కానీ, ఇప్పుడు.. ఏపీ స్టేట్‌ ఇంటిగ్రేటెడ్‌(పొలిటికల్‌) క్రిస్టియన్‌ కౌన్సిల్ నిర‌స‌న స్వ‌రం వినిపించింది.

గత ఎన్నికల్లో వైసీపీకి ఓట్లేసి గెలిపించిన త‌మ‌కు ఏం చేస్తున్నార‌ని.. కౌన్సిల్ నిల‌దీసింది. కనీసం ప్రాధాన్యం కూడా త‌మ‌కు ఇవ్వడం లేదని కౌన్సిల్‌ వ్యవస్థాపకుడు జోపెఫ్‌ విమర్శించ‌డం ఆస‌క్తిగా మారింది. అంతేకాదు.. వైసీపీ అధికారంలోకి వస్తే త‌మ‌కు న్యాయం చేస్తారని ఆశించామన్నారు. కానీ, క్రైస్తవులకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిప‌డ్డారు. రాజకీయంగా క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయంపై ఇక నుంచి పోరాటానికి దిగుతామ‌ని చెప్పారు. ఎస్సీలంటే క్రైస్తవులనే అభిప్రాయంతో ఉన్నార‌ని.. నాన్‌ క్రిస్టియన్స్‌కు పదవులు కట్టబెడుతున్నారని అన్నారు.

వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు గ‌త ఎన్నిక‌ల్లో తామంతా క‌ష్ట‌ప‌డ్డామ‌ని.. అయితే.. త‌మ‌కు క‌నీసం గుర్తింపు ఇవ్వడం లేద‌ని.. అన్నారు. ప్ర‌జాప్ర‌తినిధులుగా త‌మ‌కు ప్రాధాన్యం క‌ల్పించాల‌ని సూచించారు. కనీసం మూడు ఎమ్మెల్సీ పదవులనైనా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇక నుంచి క్రిస్టియన్‌ కమ్యూనిటీకి పని చేస్తేనే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓట్లేస్తామని స్పష్టం చేశారు. ఈ దిశగా క్రైస్తవుల్లో చైతన్యం తీసుకువ చ్చి ఒక తాటి మీదకు తెస్తామన్నారు. తాము ఇప్ప‌టి వ‌ర‌కు నోరు విప్ప‌లేద‌ని.. కానీ, త‌మ‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం వ‌ల్లే.. త్వ‌ర‌లోనే తాము దూకుడు పెంచాల‌ని నిర్ణ‌యించామ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ ప్ర‌భావం వైసీపీపై ఉంటుందా? అనేది చూడాలి.




Tags:    

Similar News