ఉక్రెయిన్లోని మేరియూపోల్ నగరంపై రష్యా సైన్యం రసాయన దాడి చేశారా ? ఇపుడీ ప్రశ్న యావత్ ప్రంపంచాన్ని కుదిపేస్తోంది. మేరియూపోల్ నగరంపై పట్టు సాధించటానికి, నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి రష్యా సైన్యం దాదాపు నెలన్నర రోజులుగా ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. అయినా నగరం పూర్తిగా రష్యా స్వాధీనంలోకి రాలేదు. దాంతో ఇక లాభం లేదనుకున్న రష్యా పాలకులు మేరియూపోల్ పై రసాయన దాడి చేయమని ఆదేశాలిచ్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మేరియుపోల్ పై రసాయన దాడి జరిగిందని సీఎన్ఎన్ మీడియా వెలుగులోకి తెచ్చింది. ఈ మీడియా కథనం ప్రకారం మానవ రహిత విమానం ద్వారా రష్యా సైనికులు మేరియుపోల్ నగరంపై విష పదార్ధాన్ని జారవిడిచారట. సైనిక స్ధావరాలు, జానావాసాలే లక్ష్యంగా రష్యా ఈ పని చేసిందని సీఎన్ఎన్ ఆరోపిస్తోంది. విషపదార్ధాలు భూమిపై పడిన కాసేపటికే చుట్టు పక్కల ప్రాంతాల్లోని జనాలకు శ్వాస సంబంధమైన సమస్యలు మొదలయ్యాయట.
ఊపిరి తీసుకోవటంలో జనాలు చాలామంది ఇబ్బందులు పడ్డారని కొందరు ఎలాగో ఆసుపత్రులకు చేరుకున్నట్లు చెప్పింది. అయితే ఇంకా చాలామంది ఎక్కడివారు అక్కడే స్పృహతప్పి పడిపోయినట్లు కూడా సదరు మీడియా చెప్పింది.
క్షేత్రస్ధాయిలో జరిగింది చూసిన తర్వాత రష్యా సైన్యం మేరియుపోల్ పై రసాయన దాడి చేసినట్లు అనుమానించింది. గుర్తు తెలియని రసాయనాన్ని రష్యా ప్రయోగించి దాని పనితీరు జనాలపై ఎలాగుంటోందో అధ్యయనం చేస్తున్నదని కూడా సీఎన్ఎన్ ఆరోపించింది.
అయితే ఇదే విషయమై ఉక్రెయిన్ ప్రభుత్వం అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. జరిగిన ఘటనపై అధ్యయనం మాత్రమే చేస్తున్నట్లు ప్రకటించింది. రసాయన దాడి జరిగిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపించకపోయినా కొత్త పద్దతుల్లో తమను భయపెట్టడానికి రష్యా ప్రయత్నిస్తున్నదని మాత్రమే మండిపడ్డారు.
సరే తాజా దాడి విషయంపై తొందరలోనే వాస్తవాలు బయటపడతాయి. ఇదే సమయంలో ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకునేంత వరకు యుద్ధాన్ని ఆపకూడదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసైడ్ చేయటం ప్రపంచదేశాలను కలవరపరుస్తోంది.