కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ పై రకరకాల స్పందనలు వస్తున్నాయి. మొత్తంగా ఇది కార్పొరేట్ శక్తులకు న్యాయం చేసే విధంగా రూపొందించారని కొందరు విమర్శిస్తున్నారు. పేదలకు, సామాన్యులకు ఏమాత్రం అనుకూలంగా తీర్చిదిద్దలేదని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ మొత్తగా బడా బాబులకు న్యాయం చేసే విధంగానే తయారు చేశారని అంటున్నారు. ముఖ్యంగా దేశంలో అత్యంత ధనవంతులైన అంబానీ.. అదానీలకు ఎక్కువ ప్రయోజనం ఉందని కొందరు అంటున్నారు.
2022-23 బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అయితే ఆమె ప్రసంగం మొత్తం కార్పొరేట్ శక్తుల చుట్టే తిరిగిందని అంటున్నారు. ఇందులో ప్రధానంగా డిజిటల్ వ్యవస్థకు ప్రాధాన్యం ఇచ్చారు. డేటా సెంటర్లు, ఎనర్జీ స్టోరేజీతో పాటు ఎలక్ట్రిక్ చార్జింగ్ ఇన్ ప్రా,గ్రిడ్ స్కేల్ బ్యాటరీ సిస్టమ్స్ వంటి ఆదునిక సదుపాయాలనకు సైతం మౌలిక హోదా కల్పిస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. అయితే ఈ సదు పాయాలు ఏర్పాటు చేసేందుకు బ్యాంకు నుంచి అతి తక్కువకే రుణాలు లభించే అవకాశం ఉంది.
అయితే ఈ రంగాల్లో ముఖేశ్, అదానీలు ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టారు. దీంతో ఈ సౌకర్యాలన్నీ వారికే లబ్ధి చేకూరుతాయని అంటున్నారు. డిజిటల్ యూనివర్సిటీలు, డిజిటల్ బ్యాంకులు, డిజిటల్ రూపీ ప్రవేశంతో శరవేగంగా పెరుగుతున్న డిజిటల్ చెల్లింపులు మారుమూల ప్రాంతాలకు చొచ్చుకుపోనున్నాయి. ఆ డేటాను దేశీయంగా నిక్షిప్తం చేసేందుకు పెద్ద ఎత్తున్న డేటా సెంటర్లు అవసరం అవుతాయని ఆయని పేర్కొన్నారు. ఇక గౌతమ్ అదానికీ చెందిన గ్రీన్ డేటా సెంటర్లు ఏర్పాటులో దేశంలో వేగవంతం చేయాలని ఇప్పటికే ఆయన ప్రకటించారు. తొలుత ఆయన ముంబై, చెన్నై, హైదరాబాద్ , ఢిల్లీలో డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలనుకుంటారు. సునీల్ మిట్టల్ కు చెందిన భారతీ ఎయిర్ టెల్ సైతం కూడా డేటా సెంటర్ల ఏర్పాట్లలో చొరవ చూపుతోంది.
ఇక ముఖేశ్ అంబానీకి చెందిన డిజిటల్ సంస్థలు జియో ఫ్లాట్ ఫామ్ ద్వారా కూడా డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని చూస్తోంది. గతేడాది ద్వితీయార్థంలో ప్రకటించిన 7,600 కోట్ల డాలర్ల పెట్టుబడి ప్రణాళికలో భాగంగా గుజరాత్లోని జామ్ నగర్లో రిలయన్స్ ఎనర్జీ స్టోరేజీ సహా నాలుగు గిగా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయబోతుంది. ఈ నేపథ్యంలో నిన్న ప్రకటించిన బడ్జెట్ వీరికే అనుకూలంగా ఉందని కొందరు వాదిస్తున్నారు. అయితే బీజేపీకి చెందిన వారు మాత్రం కావాలనే పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.