తలాపునే సముద్రం ఉన్నా.. గుక్కెడు నీటి కోసం చెన్నై వాసులు పడుతున్న బాధ అంతా ఇంతాకాదు.. తమిళనాట నీటి యుద్ధాలు ప్రారంభమయ్యాయి.. చెన్నైలో భయంకర నీటి కొరతతో ఏకంగా ఐటీ కంపెనీలు, రెస్టారెంట్లు, ప్రముఖ కంపెనీలన్నీ హాలీడేస్ ఇచ్చేశాయి. వారి ఆపరేషన్స్ ను ఇతర రాష్ట్రాల్లోని ఐటీ కంపెనీలకు తరలించారు.
చెన్నైలో ఇప్పుడు నీటి కోసం యుద్ధాలు జరుగుతున్నాయి.గత వారం నీళ్ల కోసం గొడవపడి తమిళనాడు స్పీకర్ డ్రైవర్ ధనపాల్ డ్రైవర్ రామకృష్ణన్ ఓ మహిళను కత్తితో దాడి చేశాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ మహిళ కోలుకుంటోంది. ఇక తంజావూరులో అక్రమంగా నీటిని నిల్వచేసుకుంటున్నారని సామాజిక కార్యకర్త ఆనంద్ బాబు ప్రశ్నిస్తే ఓ వ్యక్తి అతడిని కొట్టి చంపాడు. ఆ వ్యక్తిని కుమార్ గా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇలా తమిళనాట నీటి కోసం గొడవలు తీవ్రస్థాయికి చేరాయి. వానాకాలం ప్రారంభమైనా వర్షాలు సరిగ్గా కురువకపోవడం... గడిచిన వర్షాకాలంలో రిజర్వాయర్లలో నింపినా నీళ్లు పూర్తిగా అయిపోవడంతో చెన్నై సహా తమిళనాడు అంతటా ఇప్పుడు నీటి కటకట తీవ్రమైంది. నీళ్ల ట్యాంకర్ల కోసం అధిక డిమాండ్ ఏర్పడింది. నీళ్ల కోసం కొట్టుకోవడాలు.. హత్యలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది.
తమిళనాట కరువుపై ప్రతిపక్ష నేత స్టాలిన్ పోరుబాట పట్టారు. వెంటనే మున్సిపల్ శాఖ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి ఎస్పీ వేలుమణి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అన్ని వైపులా నీటి కొరత తీవ్రం కావడంతో అన్నాడీఎంకే ప్రభుత్వం పరిష్కారానికి చర్యలు చేపట్టింది.