అక్కడెక్కడో మహారాష్ట్రలోని లాతూర్ లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడటం.. అక్కడి ప్రజలు నీళ్ల కోసం అల్లాడిపోతున్న నేపథ్యంలో.. వందల కిలోమీటర్ల నుంచి నీళ్ల ట్రైన్ ను ప్రత్యేకంగా పంపటం తెలిసిందే. ఈ ఉదంతం జాతీయ మీడియా నుంచి లోకల్ మీడియా వరకూ అన్ని ఛానళ్లు ప్రముఖంగా ప్రసారం చేశాయి. దేశంలోని కరవు పరిస్థితులు.. నీటి ఎద్దడికి లైవ్ ఎగ్జాంఫుల్ అయిన ఈ ఉదంతం పలువురిని కలిచివేయటమే కాదు.. నీటి విలువ మీద అవగాహనను పెంచిందని చెప్పొచ్చు.
అంతేకాదు.. భవిష్యత్ పరిస్థితులు ఎంత దయనీయంగా ఉంటాయన్న విషయం లాతూర్ రైలు బండి చెప్పింది. అయితే.. ఇలాంటి నీటి ఎద్దడి తెలుగు రాష్ట్రాల్లోని ఏపీలోనూ ఉందన్న విషయం తెలుసా? ఎక్కడో ఉన్న లాతూరులో అంత దారుణ పరిస్థితి ఉందా? అని కదిలిపోయిన తెలుగు ప్రజలకు.. మన దగ్గరా ఇలాంటి పరిస్థితే ఉంది.
ఏపీలోని గుంటూరు జిల్లాలో ఉన్న పల్నాడు ప్రాంతంలో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొని ఉంది. ఈ నీటి కొరత కారణంగా నడికూడి రైల్వే స్టేషన్లోని ప్రయాణికులు.. అక్కడి రైల్వే క్వార్టర్లలో నివసించే అధికారులు.. కార్మికులు తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్న పరిస్థితి. దీంతో.. తాము ఎదుర్కొంటున్న నీటి ఇబ్బందుల్ని రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన రైల్వే యంత్రాంగం.. నడికూడి స్టేషన్ కు నీళ్లతో కూడిన రైలు బండిని పంపారు. ఇందులో మూడు వ్యాగిన్లను రైల్వే స్టేషన్ అవసరాలకు.. రైల్వే ఉద్యోగుల నివాసాలకు సరఫరా చేశారు. తెలుగు నేల మీద నీళ్ల కటకట ఎంతుందో నడికూడి ఉదంతమే పెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు.