ఆంధప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదం కొనసాగుతూనే ఉంది. ఆ జల వివాద పరిష్కారం కోసం ఆగస్టు 5వ తేదీన అత్యున్నత మండలి సమావేశం జరగబోతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జలవివాదాల పై ఆగస్టు 5వ తేదీన జరిగే అత్యున్నత మండలి సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ లు పాల్గొననున్నారు. ఆ భేటీ ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చలు జరపనున్నారు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, కృష్ణా, గోదావరి నదులకు సంబంధించిన అంశాలపై రెండు రాష్ట్రాలకు ఉన్న అభ్యంతరాలపై చర్చలు జరగనున్నాయి. రెండు రాష్ట్రాల పరస్పర ఫిర్యాదులపై అపెక్స్ కౌన్సిల్ లో చర్చించనున్నారు.కేంద్ర జలాశక్తి శాఖ ఈ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నివహించనున్నట్టు తెలుస్తుంది. ఈ భేటీలో కొన్ని రోజులుగా పెండింగ్ లో ఉన్న జలవివాదాలపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ముఖ్యంగా పోలవరం వంటి జాతీయ ప్రాజెక్టు నుంచి తరలించే నీటి విషయంలోనూ ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు తెరపైకి రావడంతో ఇక్కడ కృష్ణా, గోదావరి రివర్ బోర్డుల పాత్ర ప్రశ్నార్ధకమవుతోంది.ఏటా లక్షల క్యూసెక్కుల గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఏపీ సర్కారు ప్రయత్నిస్తోంది. ఈ సమయంలో గోదావరి నుంచి పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణానదికి తరలించే జలాలు మాకే చెందాలని ఏపీ, కాదు మాకే కేటాయించాలని తెలంగాణ పట్టుబడుతుంది. అలాగే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఆగస్టు 5 న జరగబోయే ఈ ఉన్నత స్థాయి భేటీలో ఈ సమస్యకి ఓ ముగింపు దొరకవచ్చు అని అంచనా వేస్తున్నారు.