జీఎస్టీ 3వేల కోట్లు కట్టే సంస్థ

Update: 2019-07-20 08:12 GMT
తెలంగాణ అభివృద్ధి పటంలో మేఘా ఇంజనీరింగ్ పాత్ర  కాదనలేనిది. ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టి శరవేగంగా పూర్తి చేస్తోంది. ఎంతో ప్రాముఖ్యత గల సంస్థపై తాజాగా తప్పుడు ప్రచారం సాగుతోంది. కొద్దిరోజుల క్రితమే ఐటీ దాడులంటూ ప్రచారం చేసిన కొందరు ఇప్పుడు జీఎస్టీ దాడులంటూ కొత్త పల్లవి అందుకున్నారు.

మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్‌-మెయిల్ (ఎంఈఐఎల్‌)పై జీఎస్‌ టీ అధికారులు దాడులు నిర్వహించారన్న వార్తను తాజాగా ప్రముఖ ఆంగ్ల దినపత్రిక  ఒకటి శనివారం ప్రచురించింది. దీనిపై మేఘా సంస్థ తాజాగా వివరణ ఇచ్చింది.  అసలు అది ఏమాత్రం వాస్తవం కాకపోయినా దాన్ని ప్రముఖంగా ప్రచురించి మెయిల్ సంస్థ నైతికతను దెబ్బతీసే ప్రయత్నం చేశారని   మేఘా సంస్థ సీఈవో ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు.. వార్తలో కనీస సమాచారం లేకుండా పూర్తిగా అవాస్తవాలను, ఊహాజనిత విషయాలను ప్రచురించారని ఆరోపించారు. కనీసమైన ధృవీకరణ లేకుండానే వార్తలను ప్రచురించడం కొన్ని అదృశ్య శక్తుల దురుద్దేశ్యాలను బట్టబయలు చేస్తున్నాయని   ఆరోపించారు..

ఇటీవల హైదరాబాద్‌కు చెందిన మరో ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీపై జరిగిన ఆదాయపు పన్ను శాఖ దాడుల విషయంలోనూ ఎలాంటి అధికారిక సమాచారం లేకుండానే మేఘా చుట్టూ అనేక వార్తలను  అల్లి ప్రచురించాయి. ఆ నేపథ్యంలోనే జీఎస్‌టీ దాడులంటూ అనవసరపు హాడావిడిని సృష్టించాలన్న ప్రయత్నం తాజాగా ఆంగ్ల దినపత్రిక చేసిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వార్తలు పునరావృతం కాకుండా ఉండేందుకు మేఘా ఇన్‌ఫ్రా కంపెనీ ఆంగ్ల పత్రికపై చట్ట పరమైన చర్యలను తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.  

ఈ వివాదంపై మేఘా సీరియస్ గానే రియాక్ట్ అయ్యింది. మేఘా ఇంజనీరింగ్ పై జీఎస్టీ దాడులంటూ జరుగుతున్న ప్రచారం  పూర్తి అవాస్తవమని సంస్థ సీఈవో తెలిపారు. తెలుగురాష్ట్రాల్లోనే అత్యధిక జీఎస్టీగా 3వేల కోట్లు కట్టే సంస్థ మేఘా ఇంజనీరింగే మాత్రమేనని ఆయన తెలిపారు. నియమాలు, నిబంధనల ప్రకారం ఇంత జీఎస్టీ కడుతున్న సంస్థపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.  జీఎస్టీ దాడులు జరిగినట్టు ఒక వార్తపత్రికలో వచ్చిన కథనంలో నిజం లేదని వివరణ ఇచ్చారు. . బిల్లులు, ఇతర వ్యవహారాల్లో అన్ని నియమ నిబంధనలకు లోబడే సంస్థ పనిచేస్తోందని ఆయన వివరించారు. దీంతో మేఘాపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి చెక్ పడింది.
    
    
    

Tags:    

Similar News