కేసీఆర్ పై జనాలకు కోపం లేదు. కానీ క్షేత్రస్థాయిలో ఉండి పనిచేయని కార్పొరేటర్లపై పీకల్లోతు ఉంది. ఐదేళ్లకు ముందర మున్సిపల్ ఎన్నికలప్పుడు కనిపించిన వారు ఇప్పటిదాకా కంటపడలేదని ప్రజలు ఉడికిపోతున్నారట.. కేసీఆర్, కేటీఆర్ లను చూసి ఓటేశాం.. మరీ మా కార్పొరేటర్ల ఇంత దారుణంగా వ్యవహరిస్తారని అనుకోలేదని వారంతా వాపోతున్నారు. మరి పోయిన సారి కేసీఆర్ ను చూసి ఓట్లు గుద్దిన ఓటర్లు ఈసారి వేస్తారా? ఇటీవల చేసిన సర్వేలో ఏం తేలింది? గులాబీపార్టీకి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలాంటి షాక్ తగులుతుంది? ప్రతిపక్షాలు లాభపడుతాయా? అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్లో పోయిన సారి కేసీఆర్ మీద.. కేటీఆర్ మీద నమ్మకంతో టీఆర్ఎస్ కు 99 సీట్లు ఇచ్చి హైదరాబాద్ ప్రజలు గెలిపించారు. అప్పుడు కార్పొరేటర్ సీట్లు ఎవరికి ఇచ్చారని కాకుండా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు ఓటేస్తే అభివృద్ధి సాధ్యమని నమ్మి ఆంధ్రా ఓటర్లు కూడా టీఆర్ఎస్ కే ఓటు వేశారు. అయితే ఆ తరువాత గెలిచిన కార్పొరేటర్స్ వాళ్ల డివిజన్ లో ఎక్కడా తిరగకుండా 5 సంవత్సరాల్లో ప్రజలకు కనపడలేదనే ప్రధాన ఆరోపణ ప్రజల నుంచి వినిపిస్తోంది.
అయితే ఇప్పుడు కేసీఆర్ మరియు వేరే జాతీయ సంస్థలు సర్వే చేస్తే ‘కేసీఆర్ మాకు తెలుసు.. కానీ మా కార్పొరేటర్ ఎవరో తెలియదు’ అని హైదరాబాద్ ప్రజలు ముఖం మీద చెప్తున్నారంట.. సర్వేలో కార్పేరేటర్ల పేర్లు ప్రస్తావిస్తే ‘పోయినసారి ఇతడికి ఓట్లు వేశాం.. అతడు ఎప్పుడు మా దగ్గరికి రాలేదు. వర్షం పడినా.. రోడ్లు ఖరాబ్ అయినా కూడా మాకు ఇబ్బందులున్నా మా కార్పొరేటర్ రాలేదు’ అని సర్వేలో అంటున్నారు.
అయితే మిగతా కాంగ్రెస్, బీజేపీలతో పోలిస్తే మాత్రం.. టీఆర్ఎస్ కు జీహెచ్ఎంసీలో అనుకూలంగా ఉందని అంటున్నారు. ప్రభుత్వం ఉంది కదా.. టీఆర్ఎస్ కే ఓట్లు వేస్తాం అని అంటున్నారట.. అభివృద్ధి కోణంలో హైదరాబాద్ ప్రజలు ఆలోచిస్తూ అధికార పార్టీకే పట్టం కట్టడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.