రాహుల్ హోమో సెక్సువ‌ల్‌..స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Update: 2020-01-03 14:26 GMT
‘వీర్‌ సావర్కర్‌ కిత్నే వీర్‌? (వీర్‌ సావర్కర్‌ వీరత్వం ఎంత?) అన్న శీర్షికన ముద్రించిన కాంగ్రెస్‌ సేవాదళ్‌ ప్రచురించిన ఓ పుస్తకంలో హిందూ మహాసభ సహ వ్యవస్థాపకుడు వీర్‌ సావర్కర్‌ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. మహాత్మాగాంధీ హంతకుడు నాథూరాం గాడ్సేకు - సావర్కర్‌ కు మధ్య స్వలింగ సంపర్కం ఉండేదని తెలిపింది. దీనిపై అఖిల భార‌తీయ హిందూ మ‌హాస‌భ అధ్య‌క్షుడు స్వామీ చ‌క్ర‌పాణి మండిప‌డ్డారు. కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స్వ‌లింగ సంప‌ర్కుడు అని ఆరోపించారు.

భోపాల్‌ లో కాంగ్రెస్‌ సేవాదళ్‌ జాతీయ శిక్షణాశిబిరం జ‌రుగుతోంది. దీనికి హాజరైన వలంటీర్లకు అందించిన పుస్త‌కాల్లో గాడ్సే - సావ‌ర్క‌ర్ స్వ‌లింగ సంప‌ర్కులు అని ఇటీవ‌ల కాంగ్రెస్ ఆరోపించింది. గాడ్సేతో సావర్కర్‌ కు స్వలింగ సంపర్క సంబంధం ఉండేదని - మైనారిటీలకు చెందిన మహిళలపై లైంగికదాడులు చేయాలని ఆయన హిందువులను రెచ్చగొట్టేవాడని ఈ పుస్తకంలో ఆరోపించింది. డొమినిక్‌ లాపియెర్రె - లారీ కోలిన్స్‌ రాసిన ‘ఫ్రీడం ఎట్‌ మిడ్‌ నైట్‌' పుస్తకం నుంచి ఒక ఉదంతాన్ని ప్రస్తావిస్తూ - ‘బ్రహ్మచర్యాన్ని స్వీకరించడానికి ముందు గాడ్సే ఒకే ఒకసారి లైంగిక సంపర్కంలో పాల్గొన్నాడు. ఆయన తన రాజకీయ గురువైన వీర్‌ సావర్కర్‌ తో స్వలింగ సంపర్క సంబంధం పెట్టుకున్నాడు’ అని సేవాదళ్‌ పుస్తకం పేర్కొంది.

సేవాద‌ళ్ బుక్‌ లెట్‌ లో కాంగ్రెస్ ఆరోప‌ణ‌లపై హిందూ మ‌హాస‌భ అధ్య‌క్షుడు రియాక్ట్ అయ్యారు. గాడ్సే - సావ‌ర్క‌ర్‌ పై చేసిన ఆరోప‌ణ‌లను స్వామి చ‌క్ర‌పాణి ఖండించారు. సావర్కర్‌ పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు హాస్యాస్పదమైనవ‌ని అన్నారు. రాహుల్ గాంధీ కూడా హోమోసెక్సువ‌ల్ అని విన్న‌ట్లు స్వామీజీ అన్నారు.కాగా, ఈ కామెంట్లు రాజ‌కీయ దుమారం రేప‌డం ఖాయ‌మంటున్నారు.


Tags:    

Similar News