మానాన్నే గెలిచారు.. కోమ‌టిరెడ్డి కుమారుడి కామెంట్ ఫుల్ ఫైర్‌

Update: 2022-10-26 07:34 GMT
మునుగోడు ఉపఎన్నికలు ఎంత రసవత్తుగా సాగుతున్నాయో అందరికీ తెలిసిందే.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో అక్కడి రాజకీయ వాతావరణం నిప్పుల కుంపటిలా మారింది. ప్రత్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు సైతం ఈ ఎన్నికకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కుమారుడు పెట్టిన ట్వీట్ వైరల్గా మారింది..  ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు.. సూటిగా.. సుత్తిలేకుండా ఉండ‌డం గ‌మ‌నార్హం. దీంతో క్ష‌ణాల్లోనే దీనిని వెయ్యి మందికి పైగానే వీక్షించారు. ఇంతకీ ఏంటా ట్వీట్?

ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు వచ్చేశాయని... నియోజకవర్గ ప్రజలు విజయం సాధించారని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనయుడు కోమటిరెడ్డి సంకీర్త్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఈ మేరకు ట్వీట్ చేశారు. "నాకు మా నాన్నను చూస్తే గర్వంగా ఉంది. ఒక్క రాజగోపాల్‌ రెడ్డిని ఓడించేందుకు 84 మంది ఎమ్మెల్యేలు 16మంది మంత్రులు 15 మంది ఎమ్మెల్సీలు 8నుంచి 10మంది ఎంపీలు... అధికార పోలీస్ బలగం కలిసి పనిచేస్తున్నాయి. మొత్తం అసెంబ్లీనే మునుగోడు ప్రజల ముందు మోకాళ్లపై నిలబెట్టారు" అని ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ వైరల్గా మారింది.

మ‌రోవైపు.. మునుగోడు ఉపఎన్నిక న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి ఆధర్మానికి మధ్య జరుగుతోందని... కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కేసీఆర్ కుటుంబంలో ఒక్కొక్కరు ఫాంహౌజ్ కట్టుకుంటున్నారన్న ఆయన.. సామాన్యులకు మాత్రం డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కట్టివ్వలేదని ఆరోపించారు.

తెలంగాణ కోసం 1,200 మంది ప్రాణత్యాగాలు చేసుకున్నారని.. విద్యార్థులు మంటల్లో కాలిపోతూ జై తెలంగాణ నినాదాలు ఇచ్చింది కేసీఆర్ కుటుంబం కోసమేనా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపైన రూ.లక్ష అప్పు ఉందన్న కిషన్రెడ్డి.. కేసీఆర్ రూ.5 లక్షల కోట్లు అప్పు చేసి.. దోచుకున్న సొమ్ముతో విమానాలు కొంటున్నారని ఆరోపించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News