అగ్రరాజ్యం అమెరికా గురించి మరోమారు అనూహ్యమైన వార్త తెరమీదకు వచ్చింది. ఇప్పటివరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాల ఆధారంగా ఇతర దేశాల నాయకులు, అధికారులు ఆందోళన చెందే పరిస్థితి ఉంటే...ఇప్పుడు ఏకంగా ఆయనే ముప్పులోకి చిక్కుకున్న అంశం తెరమీదకు వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియె ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైట్ హౌస్ లో నమ్మలేనివారే ఎక్కువని అన్నారు. గతంలో పనిచేసినవారా లేక ఇంకా ఉన్నారా అంటే ఇప్పటికీ ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ఏబీసీ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైట్ హౌస్ లో ప్రతిఘటన చాలానే ఉందంటూ గతనెల న్యూయార్క్ టైమ్స్ పత్రికలో రచయిత పేరు లేకుండా వచ్చిన ఆప్-ఎడ్ వ్యాసం సంచలనం సృష్టించిన నేపథ్యంలో మెలానియా వ్యాఖ్యలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి.
ఏబీసీ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెలానియా పలు అంశాలు పంచుకుంటూ ఎవరు ఎలాంటివారో తెలియదని - ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తారో అని వీపు తడుముకుంటూ తిరగాలని మెలానియా వ్యాఖ్యానించారు. పాలనా వ్యవహారాలు చాలా కష్టమని - ఎప్పుడూ మనుషుల మీద ఓ కన్నేసి ఉంచాలని ఆమె చెప్పారు. ప్రపంచంలో ఎక్కువగా బెదిరింపులకు గురైన వ్యక్తి కూడా తానేనని మెలానియె ఆ ఇంటర్వ్యూలో చెప్పుకోవడం గమనార్హం. సైబర్ బెదిరింపులకు గురికాకుండా పిల్లలను పెంచడంపై తాను నిర్వహిస్తున్న ప్రచారోద్యమానికీ అడ్డంకులు ఎదురవుతున్నాయని ఆమె తెలిపారు. ఏదిఏమనైనా తాను మాత్రం నిజాయితీగా అధ్యక్షుడైన తన భర్తస ట్రంప్ కు సలహాలు - సూచనలు ఇస్తానని చెప్పారు. వాటి అమలును ఆయన ఇష్టానికే వదిలేస్తానని వివరించారు. కాగా, ట్రంప్ సతీమణి చేసిన వ్యాఖ్యలు దూమారం రేపుతున్నాయి. వైట్ హౌస్ లోనే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం పట్ల అమెరికన్లు సైతం కలవరపాటుకు గురవుతున్నారు.