కరోనా వైరస్ ..ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న ఈ మహమ్మారి వల్ల ఇప్పటికే 3200 మంది మృత్యువాత పడగా, సుమారుగా 90 వేలమందికి పైగా ఈ వైరస్ చేతిలో చిక్కి ప్రాణాలతో పోరాడుతున్నారు. వీరిలో సుమారుగా వెయ్యి మంది పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్టు కొందరు చెప్తున్నారు. అయితే , ఈ కరోనా ఇంతగా అందరిపై ప్రభావం చూపుతున్నా కూడా , కరోనా భారిన పడిన వారిలో ఎక్కువశాతం మంది పెద్దవారే కావడం గమనార్హం. ఈ వైరస్ భారిన పడిన పిల్లలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అయితే , పెద్దవారిపైనే పగ సాధిస్తున్న ఈ కరోనా , చిన్న పిల్లలపై ఎందుకు ప్రభావం చూపలేకపోతుందో అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడు కొందరు వైద్య నిపుణులు పరిశోధనలు జరుపుతున్నారు.
చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన ఈ కరోనా వైరస్ చిన్నపిల్లల్లో కేవలం 2.4 శాతం మాత్రమే కేసులు నమోదు అయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ, చైనా జాయింట్ మిషన్ ఈ రిపోర్టును వెల్లడించింది. కరోనా సోకిన చిన్నారుల్లో 2.5 శాతం మందికి మాత్రమే వైరస్ లక్షణాలు కనిపించగా, వారిలో 0.2 శాతం మాత్రమే వైరస్ తీవ్ర స్థాయిలో ఉన్నట్టు తెలిపింది. ఇక వైరస్ భారిన పడి మరణించిన మూడు వేల మందిలో ఒక్కరు కూడా చిన్న పిల్లలు లేకపోవడం మరో విశేషమే. ఇది సొంతోషించదగ్గ విషయమే అయినప్పటికీ ,ఎందుకు పిల్లలకు సోకడం లేదన్నది మిస్టరీగా మారడం తో పెడియాట్రిక్ వైద్య నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. లోతుగా పరిశోధిస్తున్నప్పటికీ ఇప్పటి వరకూ సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది.
పెడియాట్రిక్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ స్పెషలిస్టు ఫ్రాంక్ ఎస్పెర్ మాట్లాడుతూ.. సాధారణ కరోనా వంటి చాలా వైరస్‌లు పిల్లలు, పెద్దల్లో ఒకేలా వ్యాపిస్తాయి.. కానీ, ఈ కరోనా వైరస్ విషయం లో కారణం ఏదైనా కావొచ్చు పిల్లల కంటే పెద్దల్లోనే వైరస్ ప్రభావం అత్యంత తీవ్రంగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. చిన్నపిల్లలు, పెద్దల్లో వ్యాధి నిరోధక వ్యవస్థ లో వ్యత్యాసం ఏంటి? అనే దానిపై వైద్యులు వనీస్సా రాబీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ సమాధానమిచ్చే ప్రయత్నం చేశారు. వయస్సు రీత్యా కూడా వైరస్ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని ఆమె అన్నారు.
పిల్లలలో ఎక్కువగా జలుబు, దగ్గు వంటి ఎక్కువగా వస్తుంటాయి. పిల్లలో శరీరంలోని రక్తకణాల్లో యాండీబాడీస్ చురుకుగా ఉంటాయి. వ్యాధులను కలిగించే వైరస్‌లను నిరోధించేందుకు ఎప్పటికప్పుడూ వ్యాధినిరోధక వ్యవస్థను పటిష్టంగా మార్చుకుంటుందని వాండర్ బిల్ట్ చిల్ర్డన్స్ ఆస్పత్రి అసిసోయేట్ ప్రొఫెసర్ బడ్డీ క్రీచ్ తెలిపారు. అందుకే పిల్లల్లోకి ఏదైనా కరోనా వైరస్ సోకితే వెంటనే వారిలోని వ్యాధినిరోధక వ్యవస్థ అప్రమత్తమై వైరస్‌ల పై ప్రతిదాడి చేస్తుంటుందని చెప్పారు. పిల్లల్లోని వ్యాధి నిరోధక వ్యవస్థ వేగవంతంగా పనిచేస్తుంది కాబట్టి ..పిల్లలపై ఈ కరోనా అంతగా ప్రభావం చూపలేక పోతుంది అని చెప్తున్నారు. ఇక పెద్దలలో ఎక్కువగా కరోనా వైరస్ సోకడానికి వారికి ఉన్న దురాలవాట్లే ప్రధాన కారణం అని చెప్తున్నారు.