కేరళ సీఎం పినరయి విజయన్ కు అనూహ్య సంఘటన ఎదురైంది. అది కూడా తన సొంత పార్టీ సీపీఐ నుంచే దీంతో ఆయన ఒక్క నిమిషం పాటు దిగ్బ్రాంతికి గురయ్యారు. తన ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఇలాంటి సంఘటన - కామెంట్లు ఎదురు కాలేదని తన అనుచరుల వద్ద వాపోయారు. అత్యంత అక్షరాస్యత ఉన్న రాష్ట్రానికి సీఎంగా ఉన్న పినరయి.. అంతలా ఫీలవ్వాల్సిన ఘటన ఏమై ఉంటుందనేది ఉత్కంఠగానే ఉంటుంది. విషయంలోకి వెళ్తే.. కేరళ రాజధాని త్రివేండ్రంలో అధికార పార్టీ సీపీఐ డైమండ్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఈ వేడుకలకు సీఎం పినరయి విజయన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వేదికపై ఉండగానే కమ్యూనిస్ట్ సీనియర్ నాయకురాలు కేఆర్ గౌరి అమ్మ ప్రసంగించారు. పార్టీ గొప్పతనాన్ని పూర్తిగా వివరించిన గౌరి.. ఇక రాష్ట్ర సంగతులకు వచ్చింది. ‘నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాత్రి 10 తర్వాత కూడా ఇంటికి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లేదాన్ని. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మహిళలు ఎదుర్కొనే కష్టాలు తెలియాలంటే మీరు చీర కట్టుకుని తిరగాలి’ అంటూ.. సీఎం పినరయి వైపు తిరిగి సూచించింది.
ఈ హఠాత్ పరిణామంతో సీఎం సహా సభకు వచ్చినవాళ్లు, వేదికపై ఉన్నవాళ్లు కూడా ఆశ్చర్య పోయారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో మహిళలపై దారుణాలు పెరిగినమాట వాస్తవమే. అయితే, దీనికి ఒక్క సీఎంను బాధ్యుడిని చేస్తూ.. ఏకంగా చీర కట్టుకుని తిరగాలనే కామెంట్ పై పినరయి అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అసలు ఆమె స్పృహలోనే ఉండి మాట్టాడుతున్నారా? అని ఎదురు ప్రశ్నించారు.
ఇక, సీపీఐ కూడా గౌరి వ్యాఖ్యలను సీరియస్ గా పరిగణిస్తున్నట్టు సమాచారం. సీఎం పినరయి ఇప్పటికే మహిళా సెల్స్ ఏర్పాటు చేశారని, మహిళలకు భద్రత కల్పిస్తున్నారని నేతలు వివరించారు. ఇక, 98 ఏళ్ల గౌరి అమ్మ కేరళలో 1957లో ఏర్పాటైన తొలి కమ్యూనిస్ట్ ప్రభుత్వంలో సభ్యురాలిగా ఉన్నారు. 2001-2006 వరకు గౌరి కాంగ్రెస్ ప్రభుత్వంతోనూ కలిసి పనిచేశారు.