ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తీసుకున్న వినూత్న నిర్ణయాలలో పోలీసులకు వీక్లీ ఆఫ్ ఒకటి. పోలీసులు ఆరుకాలాలూ పనిచేస్తూ డ్యూటీలోనే తరిస్తున్నారు. వారు సర్వీలో చేరిన నాడు వేసుకున్న యూనిఫారం రిటైర్ అయ్యేంతవరకూ అలాగే కంటిన్యూ అవుతోంది. తప్పనిసరి అయిన పనులకు తప్ప సెలవులు అంటే ఎరగని ఉద్యోగులు వారు.
అలాంటి పోలీసు శాఖలో వీక్లీ ఆఫ్ అమలు చేయాలని జగన్ తీసుకున్న నిర్ణయంతో పోలీసులు కాదు, వారి ఇంటి వారు చాలా సంతోషించారు. ఎందుకంటే వారంలో ఒక రోజు అయినా తమ భర్త ఇంటిపట్టున ఉంటారని వారు తెగ ఖుషీ ఫీల్ అయ్యారు. అయితే విశాఖ వంటి మెట్రో సిటీలలో పోలీసూలకు వీక్లీ ఆఫ్ లు అమలు కావడం లేదని తెలుస్తోంది.
వారు ఇరవై నాలుగు గంటలూ డ్యూటీస్ లో ఉంటున్నారని, అధికారులను అడిగినా కూడా ఇవ్వడంలేదని అంటున్నారు. దీని మీద హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఒకాయన సతీమణి ఏకంగా ముఖ్యమంత్రి ఆఫీసుకే లేఖ రాసింది. తన భర్తకు ఈ రోజు దాకా వీక్లీ ఆఫ్ అన్నదే లేదని, మరి అసలు అది ఏపీలో అమలవుతోందా, లేక ఒక్క విశాఖ సిటీలోనే అమలు చేయడంలేదా అని ఆమె సందేహం వెలిబుచ్చారు.
గాజువాక ట్రాఫిక్ పీఎస్ లో పనిచేస్తున్న తన భర్త ఎపుడూ డ్యూటీలోనే ఉంటున్నారని ఆమె ఆ లేఖలో ప్రస్థావించారు. ముఖ్యమంత్రి జగన్ పోలీసులకు ఇచ్చిన వీక్లీ ఆఫ్ ని చూసి ఎంతో సంతోషించామని, కానీ చివరికి అది అడియాసే అవుతోందని ఆమె వాపోయారు. విశాఖ పోలీసు అధికారులు మాత్రం వీక్లీ ఆఫ్ ఊసే లేకుండా పని చేయిస్తున్నారని ఆమె లేఖలో పేర్కొనడం జరిగింది.
సిబ్బంది వీక్లీ ఆఫ్ విషయం ప్రస్థావిస్తూంటే అధికారులు మాత్రం ఏవో సాకులు చెబుతున్నారని ఆమె ఆరోపించారు. తమకు డీజీపీ ఆఫీస్ నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేవని వాదిస్తున్నారని కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఒక విధంగా ప్రభుత్వ ఆదేశాలనే ధిక్కరిస్తున్నారని కూడా ఆమె ఫిర్యాదు చేశారు.
ఈ విషయంలో వీక్లీ ఆఫ్ కి సంబంధించిన ఉత్తర్వులు తనకు సమాచార హక్కు చట్టం కింద పంపించాలని ఆమె కోరారు. వీక్లీ ఆఫ్ లు విశాఖలో అమలు చేయాలని లేకపోతే తాను ఇదే విషయంలో కోర్టుకు కూడా వెళ్తానని ఆమె పేర్కొనడం గమనార్హం. మొత్తానికి ఒక పోలీస్ భార్య వీక్లీ ఆఫ్ ల కోసం పట్టిన పట్టు ఇపుడు విశాఖతో పాటు ఏపీలోనూ పోలీస్ శాఖలో చర్చనీయాంశం అవుతోంది. మరి దీని మీద సీఎం ఆఫీస్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.