అండర్‌వరల్డ్ డాన్‌కు అత్యంత సన్నిహితుడైన చోటా షకీల్ తాజాగా ఓ మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడారు.ఈ సందర్భంగా అతగాడు సంచలన విషయాన్ని వెల్లడించాడు. ఐపీఎల్ మాజీ బాస్ లలిత్ మోడీని బ్యాంకాంక్‌లో చంపేద్దామని తాము ప్లాన్ చేశామని.. అయితే తృటిలో మిస్ అయ్యారని వ్యాఖ్యానించారు.
క్రికెట్‌కు సంబంధం లేని ఒక వివాదానికి సంబంధించి తమకు రూ.వెయ్యి కోట్లు ఇవ్వాల్సి ఉందని.. ఆ విషయంలో లలిత్ మోడీ మాట తప్పటంతో అతన్ని హత్య చేయాలని తాము ప్లాన్ చేసినట్లు చెప్పాడు.
ఒకవేళ క్రికెట్‌కు సంబంధించిన వివాదం అయితే.. అతన్ని ముంబయిలోనే హత్య చేసే వాళ్లమని చెప్పిన చోటా షకీల్.. లలిత్ మర్డర్ ప్లాన్ గురించి వివరిస్తూ.. బ్యాంకాంక్‌లో అతన్ని చంపేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ.. అతను ఉన్న ప్లేస్‌కి వెళ్లటంతో తమ అనుచరులు కాస్త ఆలస్యం కావటంతో అతను మిస్ అయ్యాడని చెప్పుకొచ్చారు. అయితే.. ఇదంతా ఇప్పటి విషయం కాదు. గతానికి సంబంధించిందని చెప్పిన చోటా షకీల్.. ఆ వివాదానికి సంబంధించిన డబ్బుల్ని లలిత్ ఇచ్చేసినట్లు చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం తమ నుంచి అతనికి ముప్పు ఏమీ లేదని.. అతను స్వేచ్ఛగా తిరగొచ్చని చెప్పుకొచ్చాడు. ప్రతిఒక్కరూ దావూద్ పేరును వాడుకోవాలని చూస్తారని.. అందుకు లలిత్ మోడీ మినహాయింపు కాదని చెప్పుకొచ్చారు.