అమ‌రావ‌తి అభివృద్ధి మాటేంటి?

Update: 2022-03-20 07:30 GMT
ఏపీ రాజ‌దాని అమ‌రావ‌తి విష‌యంలో హైకోర్టు తీర్పు ఇచ్చిన ద‌రిమిలా..తాజాగా సీఆర్‌డీఏ అధికారులు.. రైతుల‌ను క‌లుస్తున్నారు. గ‌తంలో రాజ‌ధాని కోసం.. భూములు ఇచ్చిన నేప‌థ్యంలో ఆయా ప్లాట్ల‌ను ఇప్పుడు రిజిస్ట్రేష‌న్ చేయించుకోండి! అంటూ.. పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు.
సందేహాలు.. అనుమానాల‌కు స‌మాధానాలు కూడా ఇస్తామ‌న్నారు.  స‌రే! ఈ ప్ర‌క్రియ సంగ‌తి అలా ఉంచితే.. హైకోర్టు ఆదేశాల నేప‌థ్యంలో అంటే.. మూడు మాసాల్లో రైతుల‌కు న్యాయం చేయాల‌ని... పేర్కొన్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం.. రైతుల‌కు ప్లాట్లు రిజిస్ట్రేష‌న్ చేసి ఇవ్వ‌డం.. బాగానే ఉంది.

మ‌రి రాజ‌ధాని అభివృద్ధి మాటేంటి? అనేది మేధావుల నుంచి రైతుల నుంచి కూడా వ‌స్తున్న మాట‌. ఎందు కంటే... హైకోర్టు చెప్పిన మేరకు రైతుల‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చుతున్నారు.. బాగానే ఉన్నా.. అమ‌రావ‌తి అభివృద్ధికి, రాజ‌ధాని స్థిరీక‌ర‌ణ‌కు కూడా ప్ర‌భుత్వం మొగ్గు చూపుతున్న‌ట్టేనా.?  లేక‌.. తాము ప‌ట్టిన మూడు రాజ‌ధానుల‌నే కుందేలుతో ప‌ట్టు సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తుందా? అనేది సందేహంగా ఉంది.

ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు రాజ‌ధానుల విష‌యంపైవెన‌క్కి త‌గ్గుతున్న‌ట్టు కానీ, అమ‌రావ‌తిని అభివృద్ధి చేస్తున్న‌ట్టు కానీ, ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌నా రాలేదు.

పైగా.. మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌న త‌దిత‌రులు.. ఇంకా రెచ్చ‌గొట్టే ప‌నిలోనే ఉన్నారు. రాష్ట్రానికి మూడు రాజ‌ధానులే ఉంటాయ‌ని.. ఇది త‌మ విధాన‌మ‌ని కూడా హైకోర్టు తీర్పు అనంత‌రం.. మంత్రి బొత్స వెల్ల‌డించారు.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు.. రాజ‌ధాని రైతుల‌కు ప్లాట్లు రిజిస్ట్రేష‌న్ చేయ‌డం అంటే.. రాజ‌ధా ని నిర్మాణానికి జ‌గ‌న్‌స‌ర్కారు అంగీక‌రించిన‌ట్టా.. లేక‌.. కేవ‌లం ప్ర‌భుత్వ ఒప్పందం మేర‌కు రైతుల‌కు మే లు చేసి.. త‌న మానాన త‌ను.. మూడుకు మొగ్గు చూపే కార్య‌క్ర‌మంలో మునిగిన‌ట్టా? అనేది తేలాల్సి ఉంది. మ‌రోవైపు.. ప్ర‌భుత్వం మ‌రోసారి..రైతుల క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తే.. అది మ‌రింత వివాదం అయ్యే ప్ర‌మాదం కూడా ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.
Tags:    

Similar News