దివంగత వైఎస్ఆర్ కూతురు వైఎస్ షర్మిల ఈరోజు ఖమ్మంలో నిర్వహించే సభలో తన పార్టీ పేరు, పార్టీ రంగులు సహా పార్టీ విధివిధానాలు ప్రకటించనున్నారు. ఈ మేరకు ఉదయం ర్యాలీగా ఆమె ఖమ్మంకు చేరుకున్నారు. ఆమె ఏం ప్రకటిస్తుందన్న ఆసక్తి రాజకీయవర్గాల్లో ఉంది.
ఈరోజు వైఎస్ షర్మిల ధరించిన దుస్తులు చూశాక ఆమె పార్టీ రంగులు ఏంటనేవి చూచాయగా అర్థమవుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ముదురు నీలం రంగు అంచుతో లేత పసుపు రంగు చీర ధరించిన షర్మిల సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ఇవే ఆమె పార్టీ జెండా గుర్తులు అని అంటున్నారు. అదే రంగులో ఉంటుంది - నీలం అంచుతో పసుపు.
షర్మిల పార్టీ పేరు, గుర్తులు నిజానికి ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ రంగులను పోలి ఉంటుందని అందరూ భావించారు. జెండా రంగుతో పాటు పార్టీ సిద్ధాంతం, పేరులోనూ తన సోదరుడి పార్టీ - వైయస్ఆర్ కాంగ్రెస్‌తో పోలిక ఉంటుందని అనుకున్నారు. కానీ ఏ విధమైన పోలికలు ఉండవని.. షర్మిలా తగినంత శ్రద్ధ తీసుకొని ఈ రంగులు ఫైనల్ చేసినట్టు ప్రచారం సాగుతోంది.
మరి షర్మిల పార్టీ రంగు ఏమిటీ? జెండా ఏలా ఉంటుందనేది ఈ సాయంత్రం ఖమ్మం సభలో తేలనుంది. అప్పటివరకు షర్మిల ధరించిన చీర రంగును బట్టి అదే అని మనం అనుకోవాల్సి ఉంటుంది.