ఖాళీగా ఉండటం టీడీపీ అధినేత చంద్రబాబుకు అస్సలు ఇష్టం ఉండదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపితే.. దానికి వస్తున్న స్పందన భిన్నంగా ఉండటంతో తాజాగా ఆయన రూటు మార్చినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటివరకూ మరే విపక్ష నేత చేయని రీతిలో ఆయన కొత్త తీరును ప్రదర్శించారు. అధికారపక్షాన్ని విమర్శించేందుకు సరికొత్త విధానాన్ని అమలు చేసిన వైనం ఆసక్తికరంగా మారింది.
ఏపీలో పెరిగిపోతున్న పాజిటివ్ కేసుల విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తూనే.. రాష్ట్రప్రజల్ని అప్రమత్తం చేసేలా కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. జూమ్ యాప్ ద్వారా కరోనాలో ముందుండి పని చేస్తున్న వైద్యులతో మూడున్నర గంటల పాటు మాట్లాడటం.. ఈ సందర్భంగా నిపుణుల నుంచి వచ్చిన సలహాలు.. సూచనలు ప్రజలకు ప్రయోజనం కలిగించటం మాత్రం ఖాయం.
గ్లోబల్ ఫోరం ఫర్ సెస్టెయినబుల్ ట్రాన్స్ ఫర్మేషన్ పేరుతో ప్రతి వారం కేంద్రానికి నివేదిక పంపుతున్న బాబు తీరును కొందరు తప్పు పడుతున్నారు. మరికొందరు ఏపీలోని వాస్తవ పరిస్థితిని తెలిసేలా చేయటంలో చంద్రబాబు కారణమని చెబుతున్నారు. బాబు లాంటి బలమైన నేత లేని కారణంగానే తెలంగాణ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవటంలో విపక్షాలు విఫలమువుతున్నాయన్న వాదన వినిపిస్తోంది.
ఇక.. మూడున్నర గంటల పాటు సాగిన వెబినార్ లో వైద్యులు వెల్లడించిన అభిప్రాయాలు చాలా కీలకం. పలువురు వైద్యులు చెప్పిన మాటల్ని చూస్తే..
- కరోనా పరీక్షల తర్వాత రిపోర్టులు వచ్చే వరకూ ఇంట్లోనే ఉండాలి. పరీక్షల్లో నెగిటివ్ వచ్చినా.. మరో మూడు రోజులు వెయిట్ చేయాలి. బయటకు రాకూడదు. జ్వరం.. దగ్గు.. ఇతర లక్షణాలు ఉంటే ఐదు నుంచి ఏడు రోజులు మందులు వాడి తర్వాత పరీక్షలు చేయించుకోవాలి.
- జ్వరం.. ఒళ్లు నొప్పులు వస్తే ఇంట్లో వారికి తెలీకుండా పారసిటమాల్ తో తగ్గించుకోవాలని చూస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. వైద్యుల్ని సంప్రదించటం చాలా అవసరం.
- మరణించే వారిలో 2-5 శాతం భయంతో చనిపోతున్నారు. అరచేతులు.. అరికాళ్లలో చెమటలుపట్టటం.. పెదాలు తడారటం.. గుండె దడ.. తరచూ మూత్రానికి వెళ్లటం లాంటి లక్షణాలు ఉంటే తక్షణం కౌన్సెలింగ్ అవసరం.
- వర్షాలతో సీజనల్ వ్యాధులు వచ్చాయి. ఏది కరోనా? ఏది కాదు? అన్నది తెలుసుకోవాలి. జ్వరం.. అలసట.. ఆయాసం.. కండరాల నొప్పులు.. చలి.. విరేచనాలు.. వాసన.. రుచి తెలియకపోవటం లాంటి లక్షణాలు ఉంటే కొవిడ్ పరీక్ష చేసుకోవాలి.
- 48 గంటల పాటు 101 కంటే జ్వరం ఉంటే.. చికిత్స తీసుకోవాలి. 5 నుంచి 14 రోజులు విషమ పరిస్థితులు. ఈ సమయంలో సరిగా చికిత్స అందిస్తే బయటపడతారు. 8 నుంచి 12 రోజుల మధ్య గుర్తించినవారే ఎక్కువగా చనిపోతున్నారు.
- కరోనాతో చనిపోయిన వారికి ఆరు మీటర్ల దూరం ఉంటే సరిపోతుంది. శ్మశానాలు ఊరికి దూరంగానే ఉంటాయి కాబట్టి అంత్యక్రియలపై అనుమానాలు అక్కర్లేదు. ఆసుపత్రి మార్చురీలో నాలుగు డిగ్రీల చల్లదనంలో ఇరవైనాలుగు గంటలు ఉంచాకే అంత్యక్రియులు చేయాలి.
- కరోనా వచ్చి కోలుకున్నాక చాలామందిలో యాంటీబాడీస్ ఆరువారాల్లో తగ్గిపోయేవారిలో మరోసారి వచ్చే ప్రమాదం ఉంది. డిజిటల్ థర్మామీటర్ ను కణతపై ఐదుసెకన్లు చూపిస్తేనే సరైన ఫలితం వస్తుంది. ఎనిమిది గంటల్లోపే వచ్చే ఆర్టీపీసీఆర్ పరీక్షా ఫలితానికి ఏపీలో ఎనిమిది రోజులు ఎందుకు తీసుకుంటున్నారో పరిశీలించాలి.
- మూడురోజులు జ్వరం తగ్గకుండా దగ్గు ఉంటే సిటీ స్కాన్ చేయించుకోవాలి. రెమ్ డెసివిర్ మందుల్ని వెంటిలేటర్ సమయంలో వాడుతున్నారు. దానికంటే ముందే ప్రారంభించాలి.