హైదరాబాద్ లో అరబ్ షేక్ అంత పని చేశాడా?

Update: 2020-03-02 10:15 GMT
అరబ్ షేక్ ఒకరు నగరానికి చెందిన ఒక మహిళను బలవంతంగా తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే.. ఇద్దరు అక్కాచెల్లెళ్లు కలిసి నివసిస్తున్నారు. తమ ఇంటిని అమ్మాలని వారు నిర్ణయించుకున్నారు.

ఇదే విషయాన్ని తెలిసిన వారికి సమాచారమిచ్చారు. ఇదిలా ఉంటే.. సాబేర్ అనే వ్యక్తి ఇల్లు కొనేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా చెప్పి అక్కాచెల్లెళ్లను తన ఇంటికి పిలిచాడు. నమ్మి వచ్చిన వారి ముందు.. అరవైఏళ్ల ఇబ్రహీం అనే అరబ్ షేక్ ను పరిచయం చేశారు.

అతడ్ని పెళ్లాడాలని కోరాడు. అతడి ప్రతిపాదనను రిజెక్టు చేసిన అక్కాచెల్లెళ్లు బయటకు వెళ్లిపోయారు. అయితే.. అదే రోజు రాత్రి నుంచి చెల్లెలు కనిపించకుండా పోవటంతో అక్క ఆందోళనకు గురైంది.తన చెల్లెలు కనిపించకుండా పోవటానికి కారణం సాబేర్ అని అనుమానించిన ఆమె.. తన సోదరుడితో కలిసి అతడి ఇంటికి వెళ్లారు.

అయితే.. వారిపై సాబేర్ సతీమణి దాడికి పాల్పడింది. కనిపించకుండా పోయిన సోదరి ఆచూకీ కోసం వెతుకుతున్న వారికి.. బార్కాస్ లోని ఇబ్రహీం ఇంట్లో తమ చెల్లెలు ఉందని గుర్తించారు. వెంటనే వారు ఇబ్రహీం పాస్ పోర్టు లాక్కొని.. చెల్లెల్ని వారి చెర నుంచి విడిపించుకున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పిన అక్కాచెల్లెళ్లు.. తాజాగా పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఉదంతం బయటకు వచ్చి సంచలనంగా మారింది.
Tags:    

Similar News