దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పాత్ర ఏమిటన్న విషయాన్ని ఈ కేసులో ఏ4గా ఉన్న జెరూసలేం మత్తయ్య ఇటీవల ఈడీ (ఎన్ ఫోర్సు మెంట్ డైరెక్టరేట్)కు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఓటుకు నోటుకు సంబంధించి మాస్టర్ మైండ్ చంద్రబాబేనని స్పష్టం చేశారు. ఈ కుట్ర ఎలా జరిగింది? తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేందుకు ఎలా ప్లాన్ చేశారన్న విషయాన్ని పూసగుచ్చినట్లుగా అధికారులకు వివరించినట్లుగా చెబుతున్నారు.
ఓటుకు నోటు కేసు సూత్రధారి చంద్రబాబు అని చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్లాన్ చేసింది చంద్రబాబు అయితే.. దాన్ని అమలు చేసింది మాత్రం రేవంత్ రెడ్డి అని.. ఇందులో తనకు రూ.50లక్షలు ఎరవేసినట్లుగా ముత్తయ్య చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈడీకి ముత్తయ్య ఏం చెప్పారన్న విషయానికి సంబంధించిన బయటకు వచ్చిన సమాచారం ఇలా ఉంది.
‘టీడీపీకి చెందిన తెలుగు యువత నేత జిమ్మీబాబు ఫ్యామిలీ ఫ్రెండ్. 2015లో ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ పాల్గొనే కార్యక్రమానికి జిమ్మీబాబును ఆహ్వానిద్దామని బంజారాహిల్స్ లోని టీడీపీ కార్యాలయానికి వెళ్లా. ఆ సమయంలో చంద్రబాబు.. రేవంత్ లు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సీక్రెట్ గా మాట్లాడాలని భావిస్తున్నట్లు జిమ్మీ చెప్పారు. అందులో భాగంగా హిమాయత్ సాగర్ లో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి రావాలని చెప్పారు. జిమ్మీ సూచనతో మహానాడుకు వెళ్లా. బాబు ఉన్న గదికి తీసుకెళ్లారు’
‘అప్పటికే అక్కడ చంద్రబాబు.. ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్స్ సన్ తో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేలా చేయాలన్నారు. దీంతో భయపడ్డా. తప్పని వారించా. కానీ.. రాజకీయాల్లో ఇలాంటివి మామూలేనని.. ఈ పని చేసినందుకు రూ.50 లక్షలు ఇస్తామని చెప్పారు. దీంతో సరేనని చెప్పా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేస్తే రూ.5కోట్లు.. గైర్హాజరు అయితే రూ.3కోట్లు ఇస్తామని.. ముందుగా రూ.50 లక్షలు అడ్వాన్స్ గా చెల్లిస్తామని చెప్పారు’
‘తర్వాత స్టీఫెన్ సన్ కు ఈ డీల్ గురించి చెబితే మొదట ఆయన నమ్మలేదు. రేవంత్ తో మాట్లాడించాలన్నారు. చివరకు స్టీఫెన్ సన్ ను ఒప్పించే ప్రయత్నం చేశారు. ఆయన ఓకే అన్నాక ఈ విషయాన్ని రేవంత్ కు.. జిమ్మీకి.. టీడీపీ క్రిస్టియన్ సెల్ ఇన్ చార్జి హ్యారీ సెబాస్టియన్ కు సమాచారం ఇచ్చా. రెండుసార్లు స్టీఫెన్ సన్ ని ఆయన ఇంట్లో రేవంత్ కలిశారు. ఈ సమయంలో నాకు ఇస్తానని చెప్పిన రూ.50లక్షల గురించి అడగ్గా.. ఏర్పాటు చేస్తామని చెప్పారు. పని పూర్తికాగానే ఇస్తామన్నారు. తర్వాతి రోజు రేవంత్ ను ఏసీబీ అరెస్టు చేసినట్లుగా టీవీల ద్వారా తెలుసుకున్నా’
‘నన్ను ఓటుకు నోటు కేసులో ఏ4గా చూపించటంతోజిమ్మీ సాయంతో టీడీపీ కార్యాలయానికి వెళ్లా. నారా లోకేశ్ ను కలిశా. నాతో మాట్లాడిన లోకేశ్.. ఎలాంటి భయం అక్కర్లేదని.. ఏసీబీ డీజీ ఏకే ఖాన్ తో మాట్లాడి మేనేజ్ చేస్తానన్నారు. వెంటనే విజయవాడకు వెళ్లాలని చెప్పారు. అక్కడ తమ ప్రభుత్వమే ఉంది కాబట్టి.. రక్షణ ఉంటుందని చెప్పారు. ఈ ఉదంతంలో ఎమ్మెల్యే సండ్రను కూడా కలిశా. ఓటుకు నోటు కుట్ర కోసం 2015లో చంద్రబాబును కలిసింది నిజం’అని ఈడీకీ చెప్పినట్లుగా తెలిసింది. ఇదంతా చూస్తే.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దాదాపుగా బుక్ అయినట్లుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. తదుపరి చర్యలు ఏమవుతాయో చూడాలి.