తెలుగు రాష్ట్రాల్లో చీకోటి ప్రవీణ్ పేరు కొన్ని నెలల కిందట మారుమోగింది. క్యాసినో కింగ్ గా ప్రవీణ్ గురించి తీవ్రంగా చర్చించుకున్నారు. ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఈడీ అధికారులు గతేడాది జూలైలో రంగంలోకి దిగడంతో ఆయన చేస్తున్న దందా బయటపడింది. ఆయనతో ఎంతో మంది రాజకీయనాయకులు, ప్రముఖులు చేతులు కలిపి జూదం నిర్వహిస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. మొత్తంగా చీకోటి ప్రవీణ్ తో పాటు పలువురి ఇంట్లో 16 గంటల పాటు ఈడీ సోదాలు చేసింది. చీకోటి ప్రవీణ్ ఎన్నో ఏళ్లుగా క్యాసినో వ్యాపారం చేస్తున్నారని ఈడీ అధికారులు గుర్తించారు. 9 నెలల తరువాత చోకోటి బాగోతం మరోసారి బయటపడింది.
-ఎలా పట్టుబడ్డారు?
బ్యాంకాక్ లోని ఆసియా పట్టాయ స్టార్ హోటల్ లో భారత్ కు చెందిన ఓ ముఠా జూదం నిర్వహిస్తోందని థాయ్ లాండ్ పోలీసులకు సమాచారం అందింది. ఈ సమాచారం ఏప్రిల్ 27నే వారికి తెలిసినా వీరు తిరిగి ఇండియాకు వెళ్లే క్రమంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు నిఘా వేశారు. జూదం నిర్వహణపై ఎప్పటికప్పుడు వారు సమాచారం తెలుసుకున్నారు. మే 1న వీరంతా ఇండియాకు పయనమయ్యేందుకు రెడీ అవుతుండగా 100 మందికి పైగా పట్టాయి పోలీసులు జూదం నిర్వహించే కేంద్రంపై దాడి చేశారు. 7 అంతస్థుల భవనం.. 300 గదులు ఉన్న ఈ హోటల్ లో పారిపోయేందుకు వీలున్నా.. పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేశారు.
-రూ.500 కోట్ల లావాదేవీలు?
ఆ తరువాత ఇక్కడ చీకోటి ప్రవీణ్ సహా మొత్తం 100 మంది అరెస్టు చేశారు. వీరిలో 87 మంది భారతీయులు ఉన్నారు. వీరి వద్ద నుంచి రూ.20 కోట్ల నగదు, డెబిట్, క్రెడిట్ కార్డులు తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో తెలంగాణకు చెందిన రాజకీయ ప్రముఖులు, వ్యాపారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిని చీకోటి ప్రవీణ్ సహాయంతో థాయ్ లాండ్ వెళ్లినట్లు సమాచారం. ఒక్కొక్కరు రూ.3 లక్షలు చెల్లించి ఫ్లైట్ ఎక్కినట్లు తెలుస్తోంది. వీరు నిర్వహించిన జూదంలో రూ.500 కోట్ల లావాదేవీలు జరిగినట్లు అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న 40 లాగ్ బుక్స్ లో ఆ వివరాలు ఉన్నట్లు వారు పేర్కొన్నారు.
-తనకే పాపం తెలియదట..!
అయితే ప్రవీణ్ సహాయంతోనే మిగతా వారు థాయ్ లాండ్ కు వెళ్లినట్లు వారు చెబుతుండగా.. ప్రవీణ్ మాత్రం తనకు ఏ పాపం తెలియదని అంటున్నారు. దేవ్, సీత అనే ఇద్దరు తనకు ఆహ్వానం పంపితే థాయ్ లాండ్ వెళ్లినట్లు చెబుతున్నారు. 4 రోజులు పోకర్స్ టోర్నమెంట్ అన్నారు. అక్కడి హాల్ లోకి వెళ్లిన 10 నిమిషాలకే రైడ్ జరిగింది. థాయ్ లాండ్ లో పోకర్ నిషేధం అని తనకు తెలియదని చెబుతున్నాడు. తనకు ఏ పాపం తెలియదని.. తనను ఇరికించారని అంటున్నారు.
- థాయ్ లాండ్ లో చట్టాలు ఎలా ఉన్నాయి?
థాయ్ లాండ్ లో గ్యాంబ్లింగ్ పై నిషేధంలో ఉంది. ఈ కేసులో పట్టుబడితే 500 బాత్ (థాయ్ కరెన్సీ) నుంచి 5000 వరకు జరిమానా విధిస్తారు. లేదంటే ఏడాది వరకు జైలు శిక్ష వేస్తారు. ఇక అధికారులకు లంచం ఇస్తే మాత్రం 20 ఏళ్ల వరకు జైలు శిక్ష వేయొచ్చు. ఒక్కోసారి తీవ్రమైతే మరణ శిక్ష కూడా వేస్తారు. ఇంత కఠిన పరిస్థితుల్లో కూడా చీకోటి ప్రవీణ్ కు బెయిల్ వచ్చింది. కేవలం రూ.4,500 ఫైన్ తో ఆయన పోలీసుల నుంచి విడుదల అయ్యారు. దీని వెనుక పెద్ద ఎత్తున లాబీయింగ్ ఉందని ప్రచారం సాగుతోంది. ఇక టూరిస్టులకు విదేశీయులకు థాయ్ లాండ్ లో చాలా వెసులుబాట్లు ఉంటాయి. తీవ్రచర్యలు తీసుకుంటే పర్యాటకానికి దెబ్బ అని కొన్ని మినహాయింపులను ప్రభుత్వం కల్పించింది. ఆ లూప్ హోల్స్ తోనే చీకోటిని విడుదల చేసినట్టు చర్చ సాగుతోంది.. పైగా పెద్ద ల్యాబీయింగ్ వ్యక్తి కావడం కూడా త్వరగా బయటపడడానికి కారణంగా చెబుతున్నాయి. అరెస్టయిన తరువాత మీడియాతో మాట్లాడుతూ తనకేపాపం తెలియదని చీకోటి ప్రవీణ్ అంటున్నారు.
- ఓ మహిళ సాయం?
చీకోటి ప్రవీణ్ థాయ్ లాండ్ కు చెందిన ఓ మహిళ సాయంతో వెళ్లినట్లు తెలుస్తోంది. ఈయనతో పాటు వచ్చే వారికి సిత్రనన్ కేల్వేల్కర్ హోటల్ బుక్ చేయడం తదితర విషయాలన్నీ ఆమె చూసుకున్నట్లు సమాచారం. అయితే తాను ఓ పోకర్ ఆడడానికి వెళ్లానని ప్రవీణ్ చెబుతున్నా సిత్రనన్ కేల్వేల్కర్ చెప్పిన వివరాలను పోలీసులు బయటపెట్టారు. థాయ్ లాండ్ లో నివసించేవారిలో మానసిక సమస్య ఎక్కువగా ఉన్నవాళ్లు గ్యాంబ్లింగ్ ఆడడానికి ఇష్టపడుతారు. కానీ ఇందులో కోట్ల డబ్బు సంపాదించడానికి ఇండియా నుంచి వెళుతారు. వీరికి చీకోటి సాయం చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి.