పొత్తుల‌ పై బీజేపీ వ్యూహం ఏంటి... ఇదే ఇప్పుడు హాట్ టాపిక్..!

Update: 2023-07-06 09:57 GMT
ఏపీలో మారిన ప‌రిణామాలు.. బీజేపీ అనుస‌రిస్తున్న వ్యూహాల నేప‌థ్యంలో వ‌చ్చే 2024 ఎన్నిక‌ల‌కు సంబం ధించిన పొత్తుల విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వాస్త‌వానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తులు పెట్టు కునేందుకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ, జ‌న‌సేన‌లు రెడీగానే ఉన్నాయి.

క్షేత్ర‌స్థాయిలోనూ ఈ పొత్తుల‌పై చ‌ర్చ సాగుతోంది. అయితే..ఈ రెండు పార్టీలు కూడా బీజేపీ వైపు చూస్తున్నాయి. ఆ పార్టీని క‌లుపుకొని వెళ్ల డం ద్వారా వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని గ‌ద్దె దింపాల‌నేది ఈ రెండు పార్టీల వ్యూహంగా ఉంది.

దీనికి సంబంధించి ఇప్ప‌టికే ఢిల్లీ పెద్ద‌ల‌తో మంత‌నాలు జ‌రుగుతున్నాయ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ చెప్పారు. అయితే.. ఇవి ఎంత వ‌ర‌కు వ‌చ్చాయో తెలియ‌దు కానీ.. ఇప్పుడు ఏపీలో మారిన ప‌రిణామాల నేప‌థ్యంలో పొత్తుల విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటార‌నేది చూడాలి.

మ‌రోవైపు.. ద‌గ్గుబాటి పురందేశ్వ‌రిని పార్టీ చీఫ్‌గా నియ‌మించిన నేప‌థ్యంలో పొత్తుల విష‌యాన్ని ముందుకు తీసుకువెళ్ల‌డం పై సందేహాలు వ‌స్తున్నాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో ఆమెకు రాజ‌కీయంగా పెద్ద‌గా చొర‌వ‌లేదు. దీంతో ఇప్పుడు బీజేపీ రాజ‌కీ యాల‌పై ఆమె ఆయ‌న‌తో ఎలా చ‌ర్చిస్తార‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. ఈ విష‌యంలో గ్యాప్ ఎక్కువ‌గా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.

మ‌రోవైపు.. టీడీపీ తో క‌లిసేందుకు అస‌లు పురందేశ్వ‌రి త‌న అభిప్రాయం ఇప్ప‌టి వ‌ర‌కు వెల్ల‌డించ‌లేదు. అధిష్టానం ఇష్టం ప్ర‌కారం ముందుకు సాగుతామ‌ని చెప్పినా.. క్షేత్ర‌స్థా యిలో మాత్రం.. పురందేశ్వ‌రి అల్లుకుపోవ‌డం.. టీడీపీ నేత‌ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవ‌డం కూడా క‌ష్ట‌మ‌నే భావ‌న ఉంది.

ఈ నేప‌థ్యానికి తోడు రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై అప్పుడ‌ప్పుడు గ‌ళం విప్పుతున్నా.. నేరుగా వైసీపీపై దాడిని పెంచాల్సిన వ్యూహాన్ని ఇప్పుడు అమ‌లు చేయాల్స‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. మ‌రోవైపు.. పార్టీ నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం పెంచ‌డం.. అదేస‌మ‌యంలో పొత్తుల‌పై కీల‌క నిర్ణ‌యం వెలువ‌డితే.. ఎలా ముందుకు వెళ్లాల‌నేది ఇప్పుడు పురందేశ్వ‌రి ముందున్న ప్ర‌ధాన టార్గెట్లు. వీటిని ఆమె అధిగ‌మిస్తేనే పొత్తుల‌పై ఒక క్లారిటీ ఉంటుంద‌ని మెజారిటీ అభిప్రాయంగా వినిపిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Similar News