తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గుంటూరు జిల్లాను టార్గెట్ చేశారు. ఏపీలో అత్యధిక సీట్లు ఉన్న జిల్లా ఇది. గత ఎన్నికల్లో తెలుగుదేశానికి చేదు అనుభవాలు మిగిల్చిన జిల్లా ఇది. దాంతో 2024లో ఈ జిల్లాలో సైకిల్ జోరు పెంచాలని బాబు డిసైడ్ అయిపోయారు. దాంతో గతానికి భిన్నంగా బాబు పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్నారు.
తాజాగా సత్తెనపల్లిలో బాబు పర్యటించి టీడీపీలో కొత్త జోష్ నింపారు. సత్తెనపల్లి టీడీపీకి పెద్దగా దక్కని సీటు, చాలా కాలం తరువాత 2014లో కోడెల శివప్రసాదరావు ఇక్కడ నుంచి గెలిచారు ఇది కాంగ్రెస్, కమ్యూనిస్టులకు కలసి వచ్చే సీటుగా ఉంది. దాంతో ఈసారి ఎలాగైనా ఈ సీటులో గెలవాలని బాబు స్కెచ్ గీస్తున్నారు
ఇక్కడ టికెట్ కోసం కోడెల కొడుకు శివరాం తో పాటు మాజీ ఎమ్మెల్యే చలపతి ఆంజనేయులు. అబ్బూరు మల్లి పోటీ పడుతున్నారు. అయితే ఇటీవలే టీడీపీలోకి చేరిన సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణకు ఈ సీటు కేటాయిస్తారు అని అంటున్నారు. దాంతో ఆయన కనుక రంగంలో ఉంటే ఈ ముగ్గురి ఆశలు నెరవేరకపోవచ్చు అని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే చంద్రబాబు తాడికొండ సీటు మీద కూడా ఫోకస్ పెట్టేశారు. రాజధాని పరిధిలో ఉన్న ఈ సీటులో గత ఎన్నికలో వైసీపీ గెలిచింది. ఇక్కడ టీడీపీ నుంచి శ్రావణ్ కుమార్ ఇంచార్జిగా ఉన్నారు. ఎలాగైనా ఈ సీటుని పట్టాలని చూస్తంది టీడీపీ. ఇక పెదకూరపాడు మీద బాబు కన్ను ఉంది. ఇక్కడ టీడీపీకి బలమైన నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. కొమ్మాలపాటి శ్రీధర్ కి మళ్ళీ టికెట్ ఖాయమని అంటున్నారు.
పైగా కన్నాను టీడీపీలోకి తీసుకోవడంతో ఆయన ప్రభావం సత్తెనపల్లి, పెదకూరపాడు, గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల మీద గట్టిగా ఉంటుందని భావిస్తున్నారు. ఆయనకు ఈ నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున అనుచర గణం ఉంది. అదే విధంగా రాజధాని పరిధిలోని తాడికొండలో ఈసారి టీడీపీ పవనాలు వీస్తున్నాయని అంటున్నారు.
ఇక చంద్రబాబు తాడికొండ, పెదకూరపాడు, సత్తెనపల్లిలలో రోడ్ షో చేయడం వెనక మొత్తం ఆ బెల్ట్ లోకి వచ్చే సీట్లు అన్నీ టీడీపీ పరం చేయాలన్న టార్గెట్ ఉంది అని అంటున్నారు. ఈసారి చంద్రబాబు టికెట్లను సైతం ముందుగా ప్రకటిస్తారని, అసంతృప్తుల బెడద లేకుండా చూసుకుంటారని అంటున్నారు. దాంతో పనిచేసే వారికి టికెట్లు ఇవ్వడం ద్వారా పార్టీ విజయావకాశాలను పెంచేందుకు కొత్త వ్యూహాలను అమలు చేయబోతున్నారు.
ఇంకో సారి ఉమ్మడి గుంటూరు జిల్లాలో బాబు టూర్ ఉంటుందని అంటుననరు. ఈసారి చంద్రబాబు మంగళగిరి, పొన్నూరు తెనాలిలలో పర్యటిస్తారని అంటునరు. మొత్తం మీద చూస్తే గుంటూరు మీద పసుపు నీడ పూర్తిగా పరచేసేలా చంద్రబాబు మార్క్ యాక్షన్ ప్లాన్ కి రెడీ అవుతున్నారు. మరి ఆయన ఆలోచనలు ఎంతవరకూ వర్కౌట్ అవుతాయో చూడాల్సిందే.