వైరస్ వ్యాక్సిన్ వేళ.. ‘ఎఫికసీ’ అంటే ఏమిటి?

Update: 2021-03-04 04:30 GMT
కరోనా వచ్చింది. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అందరిని వణికించింది. భయపెట్టేస్తున్న కంటికి కనిపించని ఈ శత్రువుకు చెక్ చెప్పేందుకు వ్యాక్సిన్ సిద్ధం చేశారు. ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. తరచూ ‘ఎఫికసీ’ అన్న పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఇంతకీ దీని అర్థమేమిటి?  ఒక వ్యాక్సిన్ తమ ఎఫికసీ 95 శాతం అంటే.. మరొకరు 81 శాతంగా చెప్పుకోవటం కనిపిస్తుంది. ఈ మాటకు అర్థమేమిటి? దాని వల్ల వ్యాక్సిన్ కు కలిగే ప్రయోజనం ఏమిటి? అన్న విషయాల్లోకి వెళితే..

ఎఫికసీ అనే మాటను సింఫుల్ అర్థంలో చెప్పాలంటే.. ఒక టీకాను పది మంది తీసుకుంటే.. ఎంతమందిపై అది తన సత్తా చాటుతుందన్న విషయాన్ని చెప్పేస్తుంటుంది. ఉదాహరణకు ఏదైనా టీకా ఎఫికసీ 90 శాతం అనుకుంటే.. సదరు టీకాను పది మంది వేయించుకుంటే తొమ్మిది మందికి బాగా పని చేస్తుంది.. ఒక్కరి విషయంలో మాత్రం అది పని చేయదు. దీన్నే ఎఫికసీగా చెప్పాలి.

మరింత వివరంగా చెప్పాలంటే.. ఫైజర్ సంస్థ తాను తయారు చేసిన వ్యాక్సిన్ ట్రయల్స్ ను 43,448 మందిపై చేశారు. వారిలో 21,720 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కేవలం 8 మందికి మాత్రమే కరోనా రాగా.. వ్యాక్సిన్ తీసుకోని గ్రూపులోని వారికి 163 మందికి వచ్చింది. ప్లాసిబో గ్రూపునకు కూడా వ్యాక్సిన్ ఇచ్చి ఉంటే..ఆ గ్రూపులో కూడా 95 శాతం కేసులు రాని పరిస్థితి. దీన్నే వ్యాక్సిన్ ఎఫికసీ గా వ్యవహరిస్తారు. ఎఫికసీ అంటే.. వ్యాక్సిన్ పని చేసే తీరు. టీకా తయారీ పద్దతి ఏదైనా.. రోగ నిరోధక శక్తిని అప్రమత్తం చేయటమే దాని లక్ష్యం. అదెంత ఎక్కువగా ఉంటే.. ఆ వ్యాక్సిన్ అంత మంచిది.
Tags:    

Similar News