ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలు ఎప్పుడూ.. భిన్నంగానే ఉంటాయి. ఇక్కడ టీడీపీకి ఎంత ఆదరణ ఉందో.. ఇతర పార్టీలను కూడా అంతో ఇంతో ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారు. 2014లో టీడీపీ ఇక్కడ భారీ విజయం దక్కించుకుంది. ఒక్క తాడేపల్లి గూడెంలో బీజేపీ అప్పట్లో విజయం దక్కించుకుం టే.. మిగిలిన అన్ని స్థానాల్లో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. అయితే.. ఎందుకో.. కానీ.. 2019 విషయానికి వస్తే.. మాత్రం కేవలం రెండు స్థానాలకే పరిమితం అయిపోయింది.
పాలకొల్లు, ఉండి నియోజకవర్గాల్లో మాత్రమే.. టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. అదేసమయంలో నరసాపు రం వంటి బలమైన నియోజకవర్గాన్ని కూడా కోల్పోయింది. దీనికి కారణం.. వైసీపీపై అప్పట్లో ప్రజలకు ఉన్న అభిమానం కావొచ్చు.. జగన్ చేసిన పాదయాత్ర కావొచ్చు. లేదా.. టీడీపీ నేతల మధ్య ఉన్న లుకలుకలు కావొచ్చు. ఏదేమైనా.. కంచుకోటలో టీడీపీ ఇబ్బందులు పడింది. కట్ చేస్తే.. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా.. ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ.. రెండు మినహా.. పార్లమెంటు సహా.. వైసీపీ దక్కించుకుంది.
కానీ, మూడేళ్ల తర్వాత.. పరిస్థితిని గమనిస్తే.. గత 2019 మాదిరిగానే పరిస్థితి ఉందా? అంటే.. సందేహమేన ని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. గతంలో టీడీపీ ఎలాంటి చిక్కులు ఎదుర్కొందో.. అవే చిక్కులు వైసీపీకి ఇప్పుడు ఎదరవుతున్నాయి. సామాజిక వర్గాలు.. పార్టీ నేతలకు దూరమవుతున్నాయి. ఉదాహరణకు కొవ్వూరు నియోజకవర్గంలో మంత్రి తానేటి వనితకు వ్యతిరేకంగా.. గ్రూపులు కట్టారు. ఏలూరులో మాజీ మంత్రి ఆళ్ల నాని కి వ్యతిరేకంగా.. గ్రూపు రాజకీయాలు రోడ్డెక్కాయి.
ఇక, దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కి వ్యతిరేకంగా.. ప్రజలే వ్యాఖ్యలు చేస్తు న్నారు. చింతలపూడిలో అసలు ఇప్పుడు ఉన్న ఎలీజాకు టికెట్ ఇస్తే.. ఓడించితీరుతామని.. సొంత పార్టీ వైసీపీ నాయకులే చెబుతున్నారు. ఏలూరు ఎంపీ పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు.
ఎక్కడికక్కడ ఆయనకు కూడా సెగలు పుడుతున్నాయి. ఇక, నరసాపురం ఎంపీ పరిస్థితి అందరికీ తెలిసిందే. అదేసమయంలో ఆచంటలోనూ.. మాజీ మంత్రి రంగనాథరాజుకు వ్యతిరేకంగా..పావులు కదుపుతున్న వారు.. వైసీపీనే ఉన్నారని టాక్ వినిపిస్తోంది.
ఇలా మొత్తంగా చూసుకుంటే.. ఒకప్పుడు..టీడీపీకి కంచుకోట వంటి జిల్లాలో పాగా వేశామనే సంతోషం.. వైసీపీ మూడేళ్ల ముచ్చటగా మారిపోయిందనే వాదన వినిపిస్తోంది. మరి ఇప్పటికైనా.. ఈ పరిస్థితిని మార్చుకునేందుకు.. పార్టీని లైన్‌లో పెట్టుకునేందుకు ఏమైనా ప్రాధాన్యం ఇస్తారో.. లేక.. అంతా.. కూడా బాగానే ఉందని.. తమకు తాము.. సమర్ధించుకుంటారో చూడాలని అంటున్నారు పరిశీలకులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.