ఇటీవల సంచలనం గా మారిన ట్రైనీ ఐపీఎస్ అధికారి మహేశ్వర్ రెడ్డి సస్పెన్షన్ పై కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులను హైదరాబాద్ లోని కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ కొట్టేసింది. అంతేకాదు.. అతన్ను ప్రొబేషనరీ ట్రైనింగ్ కు అనుమతించాలని ఆదేశించింది. మహేశ్వర రెడ్డి భార్య ఫిర్యాదు పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయటాన్ని సాకుగా చూపిస్తూ ఐపీఎస్ శిక్షణ పొందుతున్న సమయంలో సస్పెండ్ చేయటం సరికాదని క్యాట్ అభిప్రాయ పడింది.
తనను సస్పెండ్ చేయటాన్ని సవాల్ చేస్తూ మహేశ్వర రెడ్డి క్యాట్ ను ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై క్యాట్ ఛైర్మన్ జస్టిస్ ఎల్.నర్సింహా రెడ్డి సభ్యులు బీవీ సుధాకర్ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి తాజా ఉత్తర్వులను జారీ చేసింది. ఈ సందర్భం గా జరిగిన వాదనల్లో ఆసక్తికర అంశాలు తెర మీదకు వచ్చాయి.
ఈ కేసు విచారణ సందర్భం గా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రికార్డుల్లో మహేశ్వర్ రెడ్డి తన భార్య భావన అని పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. భార్య భర్తల మధ్య గొడవ ఉంది. దాని పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆరోపణల దశలో ఉన్నప్పుడే ఎలా సస్పెండ్ చేస్తారు? అని ప్రశ్నించారు. బెంగళూరు లోని ఫ్యామిలీ కోర్టుల కు విడాకుల కోసం వచ్చే వారిలో అత్యధికులు ఉన్నత చదువులు చదివిన వారేనని.. వాళ్లల్లో చాలా మంది పై ఎఫ్ఐఆర్ లు నమోదు అయిన విషయాన్ని గుర్తు చేశారు. ఒకవేళ వారందరిని సస్పెండ్ చేస్తే సగం బెంగళూరు ఖాళీ అవుతుందని వ్యాఖ్యానించారు.
భార్య భర్తల కాపురంలో కలహాలు మామూలేనని.. కౌన్సెలింగ్ సరిగ్గా జరిగితే కాపురాలు నిలబడతాయని అభిప్రాయ పడ్డారు. ఎఫ్ఐఆర్ ఉందని సస్పెండ్ చేయటం చట్టవ్యతిరేకమన్నారు. తుది ఆదేశాలను అనుసరించి నిర్ణయం తీసుకుంటే తప్పు లేదు కానీ ప్రాథమిక దశలోనే సస్పెండ్ చేయటం తప్పుగా తేల్చింది.
బీటెక్ చదివే సమయం లో సహ విద్యార్థిని అయిన భావనను మహేశ్వర్ రెడ్డి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారని.. ఐపీఎస్ కు ఎంపిక కావటంతో విడాకులు ఇస్తారన్న భయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గా మహేశ్వర రెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. ఐపీఎస్ కు ఎంపికైన వేళ సమర్పించిన అధికారిక పత్రాల్లోనూ తనకు వివాహం జరిగిందన్న విషయాన్ని మహేశ్వర రెడ్డి పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. మొత్తంగా క్యాట్ ఆదేశాలు ట్రైసీ ఐపీఎస్ కు కొంతమేర ఊరట కలిగిస్తాయని చెప్పక తప్పదు.