అంచనాలకు తగ్గట్లే తాజాగా పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ తాజాగా నోటీసులు ఇవ్వటం.. విచారణకు హాజరవ్వాలని చెప్పటం తెలిసిందే.
ఇంతకూ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ మీద ఉన్న ఆరోపణలు ఏమిటి? ఆయనకు నోటీసులు ఇచ్చే వరకు విషయం ఎందుకు వెళ్లింది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాంటి నేత.. అవినాశ్ ప్రస్తావన వచ్చినప్పుడు.. 'అతను నా తమ్ముడు సామీ' అనేయటం తెలిసిందే.
వివేకానందరెడ్డి హత్య జరిగి రెండున్నరేళ్లు దాటింది. ఈ కేసులో ఇప్పటివరకు అవినాశ్ రెడ్డిని ప్రశ్నించని సీబీఐ.. తాజాగా ఆయనకు నోటీసులు ఇవ్వటం ఇదే తొలిసారి.
ఇంతకూ వివేకా హత్య కేసులో అతనిపై ఉన్న ఆరోపణలు ఏమిటి? అన్న విషయంలోకి వెళితే..
1.సీబీఐ ఛార్జిషీటు
అందులో వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి ప్రస్తావన ఉంది. తన అనుచరుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ద్వారా వివేకానందరెడ్డిని హత్య చేయించినట్లుగా అనుమానాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఆ కోణంలో దర్యాప్తు సాగిస్తున్నట్లుగా వెల్లడించారు.
2. ఎంపీ టికెట్ కోసమేనా?
కడప లోక్ సభ స్థానానికి వైసీపీ తరఫున పోటీ చేసేందుకు అయితే తాను కానీ.. లేదంటే తన సోదరుడు కుమార్తె షర్మిలకు కానీ.. సోదరుడు సతీమణి విజయమ్మకు మాత్రమే టికెట్ ఇవ్వాలని వివేకానందరెడ్డి కోరుకున్నారని.. ఈ కారణంతోనే అవినాశ్ ఆయనను హత్య చేయించి ఉంటారన్నది ఆరోపణ.
3. నిందితుడు దస్తగిరి వాంగ్మూలం
వివేకాకు సన్నిహితుడైన ఎర్ర గంగిరెడ్డి తనకు ఇచ్చిన ఆఫర్ ను వెల్లడించారు. హత్యలో భాగస్వామ్యమైన దస్తగిరి అప్రూవర్ గా మారాడు. వివేకాను చంపేస్తే నీ వెనుక మేము ఉంటాం. దీని వెనుక అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి లాంటి పెద్దోళ్లు ఉన్నారు. ఈ హత్య చేస్తే రూ.40 కోట్లు ఇస్తారు. అందులో రూ.5 కోట్లు నీకిస్తా అంటూ ఎర్రగంగిరెడ్డి తనతో చెప్పారని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు.
4. కె. గంగాధర్ రెడ్డి వాంగ్మూలం
వివేకానంద రెడ్డిని హత్య చేసి ఆ నేరాన్ని మీద వేసుకుంటే రూ.10 కోట్లు ఇస్తానని శివశంకర్ రెడ్డి ఆఫర్ చేశారు. ఈ సందర్భంలోనూ అవినాశ్ ప్రస్తావన వచ్చింది.
5. సీబీఐ అభియోగ పత్రం
కడప ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలు వివేకాను హత్య చేయించారన్న విషయాన్ని పులివెందులలో చిన్న పిల్లాడ్ని అడిగినా చెబుతారు. పలువురు సాక్ష్యులు ఇచ్చిన వాంగ్మూలాల్ని అభియోగపత్రంలో పేర్కొన్నారు.
6. గుండెపోటు నాటకం
వివేకా దారుణ హత్య తర్వాత ఆయన మరణించింది గుండెపోటుతో అంటూ మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ ప్రచారం జరిగింది. వివేకా హత్య తర్వాత అక్కడి ఆధారాల్ని ధ్వంసం చేయటంలో అవినాశ్ రెడ్డి, శివశంకర్ రెడ్డిల ప్రస్తావన ఉంది.
7. కోర్టు హాల్లో అవినాశ్ తీరు
వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి ప్రధాన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. ఆ సందర్భంగా సీబీఐ అధికారి రామ్ సింగ్ ను సీబీఐ కోర్టు హాల్లో అడ్డుకున్న అవినాశ్ రెడ్డి.. ఎందుకు అరెస్టు చేశావ్? అని ప్రశ్నించటం అప్పట్లో సంచలనంగా మారింది. సీబీఐ అధికారుల టీం కోర్టు నుంచి బయటకు వెళ్లే వేళలోనూ అవినాశ్ రెడ్డి అనుచరులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.