నిమ్మగడ్డ ఉన్నట్టుండి ఇంత మౌనం వహించడానికి కారణాలేంటి ?

Update: 2021-02-16 08:40 GMT
నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఇప్పటివరకు ఏపీలో ఏ ఎన్నికల కమిషనర్ కి ఇంతటి గుర్తింపు దక్కలేదు. దీనికి కారణం అయన తీసుకున్న కొన్ని సంచలన నిర్ణయాలు. కరోనా సమయంలో ప్రభుత్వం తో సంప్రదింపులు జరపకుండానే ఎన్నికలు వాయిదా వేయడంతో మొదలైన రచ్చ నేటికీ కొనసాగుతుంది. ప్రభుత్వానికి చెందిన మంత్రులు , కొందరు మంత్రులు ఎస్ ఈ సి నిమ్మగడ్డ పై పలు సంచలన వ్యాఖ్యలు చేస్తుంటే , దానికి నిమ్మగడ్డ కూడా సరైన రీతిలో స్పందిస్తూ వచ్చారు. అయితే , ఇప్పుడు ఒక్కసారిగా నిమ్మగడ్డ మౌనం వహిస్తున్నారు. గత రెండు రోజులుగా అయన ఎటువంటి వివాదాల జోలికి పోకుండా సైలెంట్ గా తన పనేదో చేసుకుంటూపోతున్నాడు.

రాష్ట్రంలో లోకల్ , మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడంతో ఏపీ మొత్తం అట్టుడికిపోతోంది. ఈ సమయంలో ప్రెస్‌మీట్లు, గవర్నర్‌ తో భేటీలు, అధికారులకు హెచ్చరికలు, మంత్రులకు నోటీసులు, కేంద్రానికి లేఖలు, కోర్టుల్లో కేసులు ఇలా నిత్యం బిజీగా ఉండే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌, గత రెండు రోజులుగా సైలెంట్‌ అయిపోయారు. రాజకీయాలు, మీడియాకు దూరంగా   తిరుమల శ్రీవారి సన్నిధిలో కాలం గడుపుతున్నారు. ఎటువంటి హడావిడి చేయకుండా తిరుపతిలో ఉండి మున్సిపోల్స్‌ నోటిఫికేషన్‌ ఇచ్చేశారు. శనివారం రాత్రి తిరుమలకు చేరుకున్న నిమ్మగడ్డ అప్పటి నుంచి తిరుమల కొండపైనే మకాం వేశారు. స్వామి వారి సేవలో సేద తీరుతున్నారు.

ఇప్పటివరకు రెండు సార్లు స్వామి వారిని దర్శించుకున్నారు. అంతేకాదు, తిరుమల కొండల్లోని అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ కూడా చేశారు. ఇంతకు ముందు ఆయన పర్యటనలకు ఈ పర్యటనకు చాలా మార్పు ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు… ఇంతకు ముందు రాయలసీమ, ఉత్తరాంధ్రలో పర్యటించారు నిమ్మగడ్డ. అప్పుడు మీడియాతో మాట్లాడుతూ ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేసేవారు.. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. హాయిగా తిరుమల పరిసరాల్ని చూస్తూ కూల్ గా ఉంటున్నాడు. అలాగే తిరుమల లో ఎవరిని కలవడంలేదు. అసలు నిమ్మగడ్డ ఉన్నట్టుండి ఇంత మౌనం వహించడానికి కారణాలేంటి అన్న ప్రశ్నలు ప్రస్తుతం పొలిటికల్ సర్కిళ్లలో చర్చిస్తుండగా.. రిటైర్ అవుతున్న సమయంలో వివాదాలు ఎందుకని అనుకుంటున్నారా.. లేక ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకుపోవాలో ప్రణాళికలు వేస్తున్నారా అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా గత కొన్ని రోజులుగా నిత్యం హాట్ టాపిక్ గా ఉండే నిమ్మగడ్డ సైలెంట్ గా ఉండటంతో అందరూ అయన గురించి తెగ మాట్లాడుకుంటున్నారట. 
Tags:    

Similar News