అమెరికాలో కిడ్నాప్ అయిన భారత సంతతికి చెందిన మిలియనీర్ తుషార్ అట్రే అనుమానాస్పద స్థితిలో అడవి - కొండ ప్రాంతంలో మృతిచెంది కనిపించాడు. తుషార్ అట్రే అమెరికాలో డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. మంగళవారం కొంతమంది కాలిఫోర్నియాలోని తుషార్ అట్రే నివాసంలోకి చొరబడి ఆయనను కిడ్నాప్ చేసినట్లు సమాచారం. సముద్రానికి సమీపంలో ఉన్న ఆయన విలాసవంతమైన నివాసం నుంచి దుండగులు ఆయనను అపహరించారు. తుషార్ అట్రేను అతడి స్నేహితురాలికి చెందిన బీఎండబ్ల్యూ కారులోనే ఎత్తుకెళ్లారు. ఈ విషయం తెలియగానే కాలిఫోర్నియా పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
కొండలు - దట్టమైన అటవీ ప్రాంతానికి సమీపంలో తుషార్ అట్రేకు చెందిన స్థలంలోనే బీఎండబ్ల్యూ కారుతోపాటు ఆయన మృతదేహాన్ని గుర్తించారు. తుషార్ అట్రే కిడ్నాప్ - హత్యకు సంబంధించిన కారణాలు విశ్లేషించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు. తుషార్ అట్రే కిడ్నాప్ - హత్యలో కనీసం ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్టుగా భావిస్తున్నామన్నారు. సోషల్ మీడియాలో తుషార్ అట్రే యాక్టివ్ గా ఉంటారు. సర్పింగ్ చేస్తూ.. ప్రకృతిలో గడపడం అతడికి ఇష్టం.. కొండలు - గుట్టలు - అడవుల్లో సంచరిస్తుంటాడని అతడి సోషల్ మీడియా ఖాతాలను బట్టి తెలుస్తోంది. భారత మిలియనీర్ హత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.