తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి కేసీఆర్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత జరుగుతున్న రెండో ఉప ఎన్నికగా దుబ్బాకను చెప్పాలి. టీపీసీసీ రథసారధి ఎంపీగా ఎన్నికయ్యాక.. ఉత్తమ ప్రాతినిధ్యం వహించిన హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఇటీవల దుబ్బాక ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న సోలిపేట అనారోగ్యంతో మరణించటంతో.. తాజాగా ఇక్కడ ఉప ఎన్నికను నిర్వహిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో వరుసగా రెండుసార్లు దుబ్బాక స్థానాన్ని సొంతం చేసుకున్న అధికార పార్టీకి తాజా ఉప ఎన్నికల్లో అధిక్యత కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. నిజానికి ఈ ఉప ఎన్నిక ఫలితం ఏమిటన్న విషయంపై ఎవరికి ఎలాంటి అనుమానాల్లేవు. టీఆర్ఎస్ కు బలమైన క్యాడర్ తో పాటు.. విశ్వసనీయమైన ఓటు బ్యాంకు ఉన్న నేపథ్యంలో గులాబీ కారు ఈ ఉప ఎన్నికల్లో దూసుకుపోవటం ఖాయం.
ఆ విషయం అధికార టీఆర్ఎస్ పార్టీకే కాదు.. ప్రత్యర్థులుగా బరిలో నిలిచిన కాంగ్రెస్.. బీజేపీలకు క్లారిటీ ఉంది. అయినప్పటికీ ఉప ఎన్నికల బరిలో నిలవటానికి కారణం ఏమిటి? అన్నది ఆసక్తికరంగా మారింది. అధికార టీఆర్ఎస్ కు కంచుకోట అయిన దుబ్బాకలో అభ్యర్థుల ఎంపికలోనూ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదట్నించి అనుకున్నట్లే టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట రామలింగారెడ్డి సతీమణికి టికెట్ ను కన్ఫర్మ్ చేశారు కేసీఆర్.
బీజేపీ నుంచి రఘునందనరావును డిసైడ్ చేశారు. గత ఎన్నికల్లో ఓడిన ఆయన.. మరోసారి బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో ఓడిన నేపథ్యంలో తనపై ఉండే సానుభూతి ఏమైనా వర్కువుట్ అవుతుందా? అన్నది ప్రశ్న. ఇక.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయంలోనూ అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలుత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నర్సారెడ్డిని అనుకున్నారు. పార్టీకి చెందిన ముఖ్యనేతలంతా ఆయనకే మద్దతు ఇవ్వటం.. ఢిల్లీకి సైతం ఆయన పేరే పంపుతున్నట్లుగా ప్రచారం జరిగింది.
అనూహ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన చెరుకు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావటంతో ఆయనకు టికెట్ ను కన్ఫర్మ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. టీఆర్ఎస్ అభ్యర్థికి బలమైన ప్రత్యర్థి అవుతారన్న అంచనాలు వినిపించాయి. అయితే.. వాస్తవం వేరుగా ఉందంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఉప ఎన్నికల్లో కోట్లాడేది టీఆర్ఎస్ అభ్యర్థితో కంటే కూడా.. బీజేపీ అభ్యర్థిలోనేనని చెబుతున్నారు. దీంతో టైట్ ఫైట్ వీరిద్దరి మధ్య సాగితే.. మొత్తంగా సోలిపేట సతీమణి సుజాతకు అనుకూలంగా మారటం ఖాయమంటున్నారు.
నిజానికి కాంగ్రెస్.. బీజేపీ అభ్యర్థుల్లో ఎవరికి గెలుపు మీద ఆశలు పెద్దగా లేవన్న మాట బలంగా వినిపిస్తోంది. అయితే.. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చిన మెజార్టీని తగ్గించటం మీదనే వారి ఫోకస్ ఉందని చెబుతున్నారు. మెజార్టీ ఎంత తగ్గితే.. అంతగా టీఆర్ఎస్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భావిస్తున్నారు. అందుకే.. దుబ్బాకలో తీవ్రమైన పోటీ నెలకొని ఉందన్న మాట వినిపిస్తోంది. మరి.. వారి లక్ష్యం నెరవేరుతుందా? అన్నది ఉప ఎన్నికల పలితాలు వెల్లడైతే కానీ క్లారిటీ రాదని చెప్పాలి.