ఇటీవల కాలంలో ఒక సినిమా విడుదలై.. దానిపై భారీ ఎత్తున చర్చ జరగడమే కాదు.. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా ఇంత దారుణం జరుగుతుంటే.. దేశం ఏం చేసింది? అప్పట్లో అధికారంలో ఉన్న వారు ఏం చేశారు? మరీ ఇంత దారుణమా? అంటూ కశ్మీర్ ఫైల్స్ మూవీని చూసినోళ్లంతా కామెంట్ చేసిన వారే. కేవలం మౌత్ టాక్ తో ఈ మూవీ ఎంత భారీ హిట్ అయ్యిందో తెలిసిందే. సాదాసీదాగా విడుదలైన ఈ మూవీ ఒక బ్లాక్ బస్టర్ మూవీ కలెక్షన్లను రాబట్టడమే కాదు.. ఇటీవల కాలంలో మరే సినిమా ప్రదర్శించనంత ఎక్కువ కాలం థియేటర్లలో ప్రదర్శించారని చెప్పాలి.
ఎనభై దశకంలో కశ్మీర్ వ్యాలీలో ఉన్న హిందూ పండిట్లను కశ్మీర్ లోయ నుంచి పంపించే దారుణ ఉదంతం చోటు చేసుకోవటం.. ఆ సందర్భంగా ఏం జరిగింది? ఎంతటి మారణహోమం జరిగిందన్న విషయంతో పాటు.. నాటి దారుణాలకు బాధ్యులైన వారికి శిక్ష పడకుండా ఉండటం ఒక ఎత్తు అయితే.. అమాయక పండిట్లు మాత్రం దుర్బర జీవితాన్ని అనుభవించాల్సి వచ్చింది. ఈ సినిమాను చూసి.. చరిత్రను తిరగేసి.. అప్పటి రోజుల్లో మోడీ లాంటి ప్రధానమంత్రి పవర్లో ఉండి ఉంటే.. సీన్ ఇలా ఉండేది కాదన్న మాట పలువురి నోటి నుంచి వినిపించింది. అదే నిజమని అనుకుంటే.. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.
ఇటీవల కాలంలో శ్రీనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకొని వారిని హతమారుస్తున్న వైనం తెలిసిందే. నిన్నటికి నిన్న ఒక బ్యాంక్ ఉద్యోగిని కాల్చి చంపటంతో పాటు ఇప్పటికే పలు హత్యలు నెలకొన్నాయి. దీంతో భయపడిపోయిన కశ్మీరీ పండిట్లు తమను సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేయాలని వేడుకుంటున్నారు. మొన్నటి వరకు కొడగట్టిన ధీమాతో ఉన్న వారు ఇప్పుడు పూర్తిగా జావ కారిపోయి.. తమను శ్రీనగర్ నుంచి వేరే చోటుకు బదిలీ చేయాలంటూ కోరుకుంటున్నారు.
కశ్మీరీ పండిట్ల డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన కేంద్రం.. తాజాగా 177 మంది పండిట్ టీచర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కాలంలో కశ్మీర్ లో చోటు చేసుకుంటున్న వరుస హత్యల నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా.. ఆర్మీ చీఫ్ మనోజ్ సిన్హా.. జమ్ముకశ్మీర్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ కీలక సమావేశం ముగిసిన కొన్ని గంటల వ్యవధిలోనే కీలక ఉత్తర్వులు జారీ కావటం చూస్తుంటే.. ప్రధాని స్థానంలో మోడీ ఉన్న వేళలోనూ కశ్మీర్ పండిట్ల ప్రాణాలకు భరోసా కల్పించటంలో ఎందుకు విఫలమైందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
1990లో కశ్మీర్ లోయలో మైనార్టీలుగా ఉన్న పండిట్లపై జరిగిన ఊచకోతలో వేలాది కశ్మీరీ కుటుంబాలు రోజుల వ్యవధిలో తమ ఆస్తుల్ని వదిలేసి వలస వెళ్లిపోయాయి. ఇలాంటి వీరిని తిరిగి స్వస్థలాలకు రప్పించేందుకు కేంద్రం ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించింది. ప్యాకేజీ కింద వేలాది మందికి ఎస్సీ కోటాలో ఉద్యోగాలు ఇచ్చి కశ్మీర్ లోయలో నియమించింది. వీరికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించటంతో చాలామంది కశ్మీర్ లోయకు తిరిగి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయి.
వారం వ్యవధిలో ఎనిమిది మందిని హతమార్చటంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కశ్మీర్ వ్యాలీలో విధులు నిర్వర్తిస్తున్న వేలాది మంది తమను వేరే ప్రాంతాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా 177 మంది టీచర్లను బదిలీ చేశారు. మరి.. ప్రధానమంత్రి కుర్చీలో మోడీ ఉన్న వేళలోనూ కశ్మీర్ లో సీన్ ఎందుకు మారటం లేదు?