విదేశాలకు వెళ్లాలని భావించే వారికి తప్పనిసరిగా ఉండాల్సింది పాస్ పోర్టు. దీన్ని జారీ చేసేందుకు విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో పాస్ పోర్టు సెంటర్లు పని చేస్తుంటాయి. గతంతో పోలిస్తే.. పాస్ పోర్టు జారీ విషయంలో చాలానే మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పాలి.గతంలో పాస్ పోర్టు అప్లై చేసుకుంటే నెలల తరబడి కూడా వచ్చేవి కావు. కానీ.. ఇప్పుడు వారం వ్యవధిలోనే వచ్చేస్తున్న పరిస్థితి. ఇప్పుడున్న పాస్ పోర్టులకు అదనంగా ఈ-పాస్ పోర్టు ను జారీ చేయాలని కేంద్రం భావిస్తోంది.
దీంతో.. నకిలీ పాస్ పోర్టులకు కళ్లెం వేయటంతో పాటు.. ఎయిర్ పోర్టుల్లో మరింత వేగంగా సేవలు అందించేందుకు వీలు అవుతుందని చెబుతున్నారు. దేశీయంగా మరో ఐదు నెలల్లో ఈ-పాస్ పోర్టులో అందుబాటులోకి రానున్నాయి.
ఇప్పుడున్న పాస్ పోర్టుకు.. కొత్తగా వచ్చే ఈ-పాస్ పోర్టుకు మధ్యనున్న తేడా ఏమిటన్నది చూస్తే.. ఈ-పాస్ పోర్టులో చిప్ ను అమరుస్తారు. అందులో పాస్ పోర్టుకు సంబంధించిన వ్యక్తి వివరాలన్ని నిక్షిప్తమై ఉంటాయి.
ఈ-పాస్ పోర్టు ఎంట్రీతో నకిలీ పాస్ పోర్టులకు చెక్ చెప్పటమేకాదు.. అక్రమ రవాణాదారులకు కళ్లేం వేయటానికి సాయం చేస్తుందని చెప్పాలి. మరి.. ఈ-పాస్ పోర్టు తప్పనిసరా? అన్న ప్రశ్నకు కాదనే సమాధానం చెబుతున్నారు. మామూలు పాస్ పోర్టు తో పాటు ఈ-పాస్ పోర్టును కూడా జారీ చేస్తారు. ఐశ్చికమే తప్పించి తప్పనిసరి కాదు. కాకుంటే.. రాబోయే రోజుల్లో దీన్ని తప్పనిసరి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇక.. పాస్ పోర్టు జారీలో అత్యంత ఆలస్యానికి కారణాల్లో ప్రధానమైనది పోలీసు వెరిఫికేషన్. ప్రతి పాస్ పోర్టు జారీ సందర్భంగా స్థానిక పోలీసులు తనిఖీ చేసిన తర్వాతే నో అబ్జెక్షన్ ఇచ్చిన తర్వాతే పాస్ పోర్టును జారీ చేస్తారు. అయితే..
దీనికి సంబంధించిన వెరిఫికేషన్ కోసం పోలీసులు చేస్తున్న ఆలస్యం కారణంగా పాస్ పోర్టుల జారీ ఆలస్యమవుతుందన్న విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో పోలీస్ వెరిఫికేషన్ ను ఎట్టి పరిస్థితుల్లో 5 రోజుల్లో పూర్తి చేసేలా చూస్తామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. అదే జరిగితే.. ఇప్పుడున్న దానికి మించి త్వరగా పాస్ పోర్టులు జారీకి వీలు ఉటుందని చెప్పొచ్చు.