ఇప్పుడు స‌డ‌లింపులు.. జూన్‌లో మ‌ళ్లీ పూర్తి లాక్‌డౌనా..?

Update: 2020-05-20 02:30 GMT
దాదాపు రెండు నెల‌లుగా కొన‌సాగుతున్న లాక్‌డౌన్ మ‌రికొన్నాళ్ల పాటు కొన‌సాగుతోంది. మే నెలాఖ‌రు వ‌ర‌కు నాలుగో ద‌శ లాక్‌డౌన్ ఉంది. అయితే పేరుకు లాక్‌డౌన్ ప్ర‌క‌టించినా దేశ‌మంతా అన్ని స‌డ‌లింపులు ఇచ్చారు. తీవ్ర ఆంక్ష‌ల‌న్నీ ఎత్తివేశారు. దీంతో సాధార‌ణ ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇన్నాళ్లు విధించిన లాక్‌డౌన్‌తో పెద్ద ప్ర‌యోజ‌నం ఏమీ లేక‌పోవ‌డంతో చివ‌ర‌కు ఎత్తివేసే ప‌రిస్థితికి వ‌చ్చింది. అయితే దేశంలో ఇంకా ఆ మ‌హ‌మ్మారి అదుపులోకి రాలేదు. తీవ్ర‌స్థాయిలో విజృంభిస్తోంది. అయినా స‌డ‌లింపులు ఇచ్చారు. అయితే ప‌రిస్థితులు చూస్తుంటే దేశంలో ఇంకా ఆ వైర‌స్ కేసులు భారీగా పెరిగే అవ‌కాశం ఉంది. దీన్నిబ‌ట్టి చూస్తే ఇప్పుడు స‌డ‌లింపులు ఇచ్చి మ‌ళ్లీ త‌ర్వాత పూర్తి లాక్‌డౌన్ విధించేట‌ట్టు ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి.

ఎందుకంటే మూడు ద‌శ‌ల లాక్‌డౌన్‌తో భార‌త‌దేశ ఆర్థిక‌వ్య‌వ‌స్థ చిన్నాభిన్న‌మైంది. దేశంలో ప‌రిస్థితులు దారుణంగా మారాయి. ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రి ప‌రిస్థితి ఆర్థికంగా క‌ష్టాలే ఏర్ప‌డ్డాయి. దేశం ప‌రిస్థితి కూడా అలాగే ఉంది. దీంతో గ‌త్యంత‌రం లేక లాక్‌డౌన్ పొడిగిస్తూనే భారీగా స‌డ‌లింపులు ఇచ్చారు. ప్ర‌స్తుతం ఆదాయం త‌ప్ప‌నిస‌రి కావాలి. వ్యాపారా, వాణిజ్య‌, ఇత‌ర కార్యక‌లాపాలు న‌డిస్తే కొంత ఆర్థిక ప‌రిస్థితి అదుపులోకి వ‌స్తుంద‌ని అంద‌రి అంచ‌నా. అందులో భాగంగానే దాదాపుగా అన్నింటికీ అనుమతి ఇచ్చారు. ప్ర‌స్తుతం వైర‌స్ కేసులు లక్ష దాటిపోగా.. రోజుకు 5 వేల కొత్త పాజిటివ్ కేసులు వెలుగులోకి వ‌స్తున్నాయి.

సడలింపులు ఇవ్వ‌డంతో ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావ‌డం మొద‌లుపెట్టారు. వారి రోజువారీ జీవితం ప్రారంభ‌మైంది. అయితే ఈ స‌మ‌యంలో ఆ వైర‌స్ నుంచి కాపాడుకునేందుకు జాగ్ర‌త్త‌లు, ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవాలంటే కొంత క‌ష్ట‌మే. ప్ర‌జా జీవ‌నం మొద‌ల‌వ‌డంతో ఆ వైర‌స్ వ్యాప్తి జోరు పెంచుకునేలా ఉంది. దీంతో మ‌ళ్లీ కేసులు భారీస్థాయిలో పెరిగే అవ‌కాశం ఉంది. నాలుగో ద‌శ లాక్‌డౌన్ మే 31వ తేదీతో ముగియ‌నుంది. మరో 14 రోజులు ప్ర‌జ‌లు సాధార‌ణ స్థితిలో ఉండ‌నున్నారు. ఆలోపు ఆ వైర‌స్ అదుపులోకి వ‌స్తే ఇదే ప‌రిస్థితిని కొన‌సాగిస్తారు. అలా కాకుండా వైర‌స్ తీవ్ర‌స్థాయిలో విజృంభిస్తే మ‌ళ్లీ పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించే అవ‌కాశం ఉంది.

దీనిపై కూడా కేంద్ర ప్ర‌భుత్వం ఫోక‌స్ పెట్టిన‌ట్టు స‌మాచారం. ఒక‌వేళ కేసులు పెరిగితే ఏం చ‌ర్య‌లు తీసుకోవాలో ఇప్ప‌టి నుంచే దృష్టి సారించింది. దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్ దేశాలు మొద‌ట్లో లాక్‌డౌన్ పూర్తిగా విధించారు. ఆ త‌ర్వాత భారీగా సడలించారు. అయితే మ‌ళ్లీ కొన్నాళ్ల‌కు పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ విధించారు. ఈ విధంగా భార‌త‌దేశం కూడా చేప‌ట్టే అవ‌కాశం క‌నిపిస్తోంది. అంటే జూన్‌లో మ‌ళ్లీ పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించేలా ప‌రిణామాలు ఉన్నాయి. ఏది ఏమున్నా ఆ వైర‌స్ వ్యాప్తిని బ‌ట్టి భ‌విష్య‌త్ ఏంట‌నేది తెలియ‌నుంది.
Tags:    

Similar News