దేశంలోని మరే రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని పనిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారు. ప్రభుత్వ బొక్కసం నుంచి వందల కోట్లను ఒక దేవాలయం కోసం ఖర్చు పెట్టటం ఇప్పటివరకు జరగలేదని చెప్పాలి. యాదగిరి గుట్టగా ఉన్న దేవాలయాన్నియాదాద్రిగా మార్చేయటమే కాదు.. దాని రూపురేఖల్ని గుర్తించలేనంత గొప్పగా మార్చే ప్రయత్నం తుది దశకు చేరుకుంది. తిరుమల క్షేత్రాన్ని తలదన్నేలా చేయాలన్న కేసీఆర్ సంకల్పం చివరి దశకు చేరుకుంది.
ఇక్కడ చేపట్టాల్సిన పనులు దాదాపుగా పూర్తి అయ్యాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రికి వెళుతున్న వైనం ఆసక్తికరంగా మారింది. తాజాగా వచ్చిన షెడ్యూల్ ప్రకారం కొండపైన బాలాలయంలో ప్రత్యేక పూజల్ని నిర్వహిస్తారు. అనంతరం కొండపై ఉన్న మౌలిక సదుపాయాల పురోగతిని పరిశీలిస్తారు.
మూడు నెలల్లో గర్భాలయ దర్శనాల్ని ప్రారంభించాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. చిన జీయర్ స్వామి చెప్పినట్లుగా జరిగిన పనులు ఏమేరకు జరిగాయన్నది స్వయంగా పరిశీలించనున్నారు. ఈ పర్యటనలోనే గుడిని ఎప్పుడు ప్రారంభించాలి.. దానికి ముందు యాగం నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న కేసీఆర్.. అందుకు సంబంధించిన కీలక ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు. మరేం చేస్తారో చూడాలి. కీలకమైన ఎమ్మెల్యే ఎన్నికలు జరుగుతున్న వేళ.. యాదాద్రి ట్రిప్ వెనుక మరేదో కారణం ఉందన్న మాట వినిపిస్తోంది.