సంచలనాల మీద సంచలనాలు నమోదవుతున్న టాలీవుడ్ నటి శ్రీరెడ్డి ఎపిసోడ్ లో మరో కొత్త కోణం బయటకు వచ్చింది. శ్రీరెడ్డి వెనుక కొందరు మీడియా ప్రముఖులు ఉన్నట్లుగా.. వారు డబ్బు కోసమే ఆమె చేత ఇవన్నీ చెప్పిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. మహా టీవీ ఛానల్ ముఖ్యుడు.. సీనియర్ జర్నలిస్ట్ మూర్తి పేరిట ఒక నకిలీ వాట్సాప్ ఛాట్ ప్రస్తుతం సర్క్యులేట్ అవుతోంది. ఇదే కాదు.. మరో ప్రముఖ ఛానల్ ముఖ్యుడు.. మీడియా పరంగా సెలబ్రిటీ హోదాను సొంతం చేసుకున్న వ్యక్తి సైతం.. శ్రీరెడ్డితో ఛాట్ చేసినట్లు.. ఆమెతో సెక్స్ కోసం తహతహలాడుతున్నట్లుగా ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.
అయితే.. ఇవన్నీ కూడా ఫేక్ అంటూ శ్రీరెడ్డి ఇప్పటికే తన అకౌంట్లో స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. తన పేరుతో వైరల్ అవుతున్న ఫేక్ వాట్సాప్ చాట్ పై మహా మూర్తి రియాక్ట్ అయ్యారు. తమ ఛానల్ లో చర్చకు పిలిచిన సందర్భంగా.. తన పేరుతో వైరల్ అవుతున్న వాట్సాప్ చాట్ లోని అంశాల్ని ప్రస్తావించటమే కాదు.. ఈ తరహా మకిలి ప్రచారానికి వ్యతిరేకంగా తాను ఇప్పటికే పోలీసు ఫిర్యాదు చేశానన్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పెద్ద డైరెక్టర్లతో ఏదైనా చాట్ చేసి ఉంటే.. ఆ ఆధారాలు ఇవ్వండి.. ప్లే చేస్తాను.. దాంతో డబ్బులు డిమాండ్ చేయాలన్న మెసేజ్ లు ఉన్నాయి. శ్రీరెడ్డితో సెక్సువల్ రిలేషన్ వద్దు కానీ.. ప్రముఖులకు సంబంధించిన వివరాలు ఇస్తే.. వారి నుంచి డబ్బు డిమాండ్ చేద్దామన్నట్లుగా వాట్సాప్ ఫేక్ చాట్ లో ఉన్న విషయాన్ని మూర్తి ప్రస్తావించారు. ఈ విషయంపై మూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మహా ఛానల్ తరఫున తాము ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామని.. ఇలాంటి దుష్ప్రచారాలకు దిగిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అదే సమయంలో తన రెండు దశాబ్దాలకు పైగా జర్నలిస్ట్ కెరీర్ లో ఏ రోజైనా..ఎవరి దగ్గర నుంచి అయినా డబ్బులు తీసుకున్నట్లు నిరూపించినా తాను ఉరికి సిద్ధమని భారీ సవాల్ విసిరారు. ఒకవేళ.. ఇప్పుడు కాకున్నా మరో ఇరవై ఏళ్ల తర్వాత అయినా తాను డబ్బుల కోసం తప్పు చేసినట్లు తేలితే.. తన సమాధిలో నుంచి ఎముకల్ని బయటకు తీసి మళ్లీ కాల్చాలంటూ తీవ్రంగా రియాక్ట్ అయ్యారని.. తానెప్పుడూ టీఆర్పీ కోసం పాకులాడలేదని.. శ్రీరెడ్డి కొన్ని ఆధారాలు తనకు ఇచ్చినా.. తాను వాటిని బయటపెట్టలేదన్నారు.
పాత్రికేయ రంగాన్ని తానెంత పవిత్రంగా భావిస్తానన్న విషయాన్ని సుదీర్ఘంగా చెప్పుకున్న మహా మూర్తి.. శ్రీరెడ్డి చేస్తున్న పోరాటానికి తాను సపోర్ట్ చేస్తానన్నారు. చిత్రపరిశ్రమకు చెందిన కొందరు చేసే తప్పుల మీదనే తమ పోరాటమని స్పష్టం చేశారు.