90 శాతం తెలుగోళ్లకు తెలియని విషయాలంటూ వైరల్ అవుతున్న వాట్సాప్ పోస్టు నిజమెంత?
మీడియా స్థానే సోషల్ మీడియా రావటం.. దానికి మించిన వాట్సాప్ యూనివర్సిటీ తెర మీదకు వచ్చి.. తనకున్న మేథస్సుతో తమకు నచ్చిన వాదనల్ని.. తమకు మాత్రమే తెలిసిన విషయాల్ని మసాలా దట్టించి ప్రజల మీదకు వదిలే తీరు అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఒకప్పుడు ఒక వైపు వాదనల్ని ఎక్కువగా వినిపించే పరిస్థితి నుంచి.. ఇప్పుడు ఎవరికి వారు..వారి వాదనల్ని చెప్పేస్తూ తీవ్రమైన గందరగోళానికి నెట్టేస్తున్నారు. దీంతో నిజం ఏమిటన్నది కాగడా పట్టుకొని వెతకాల్సిన పరిస్థితి వచ్చింది.
రాష్ట్రాలు.. వాటి సరిహద్దులతో సంబంధం లేకుండా సెప్టెంబరు 17న తెలంగాణలోనిర్వహించే విమోచన/విలీన దినోత్సవానికి సంబంధించిన చర్చ..రాజకీయ వేడి కారణంగా 74 ఏళ్ల క్రితం ఈ రోజు గురించి.. ఈ రోజు వెనకున్న చరిత్ర గురించి ఇప్పుడు బోలెడన్ని వాదనలు.. వార్తలు వస్తున్నాయి. ఇలాంటివేళ.. ఒక వాట్సాప్ పోస్టు వైరల్ గా మారింది. 90 శాతం మంది తెలుగువారికి తెలియని విషయాలంటూ వైరల్ అవుతున్న ఈ పోస్టును ఒక్కసారి చూస్తే.. అందులోని నిజానిజాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది.
- తెలంగాణాకు స్వాతంత్ర్యం 15-ఆగస్టు-1947న రాలేదు. 17-సెప్టెంబర్-1948న వచ్చింది. అదీనూ యుద్ధం ద్వారా.
ఇందులో సగం నిజం. సగం అబద్ధం ఉంది. యుద్ధం వల్ల అంటే.. రెండు వైపుల నుంచి పోరు జరగాలి. కానీ.. భారత సైన్యం నిజాం రాజ్యంలోకి అడుగు పెట్టేసరికే.. ప్రజలు సైన్యానికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటివేళ.. యుద్ధం అనటంలో అర్థం లేదు. కాకుంటే.. భారత్ లో విలీనం కావటానికి నానుస్తున్న నిజాంను పోలీసు చర్యతో దారికి తెచ్చారని చెప్పొచ్చు.
- తెలంగాణా ఏనాడూ బ్రిటిష్ పాలనలో లేదు.. 1948లో స్వాతంత్ర్యం వచ్చింది ఇస్లామిక్ పాలన నుంచి.
ఇందులో కూడా ఒక వాస్తవం ఉంటే.. మరో అబద్ధం ఉంది. బ్రిటిష్ పాలనలో లేదన్నది నిజమే అయినా.. నిజాం పాలనను పూర్తిగా ఇస్లామిక్ పాలనగా అభివర్ణించటం దుర్మార్గమే అవుతుంది. నిజాంకు ముందు ఈ గడ్డను పాలించిన ముస్లింలు.. తాము ముస్లిం మతస్తులమన్న భావనకు అంత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. కాబట్టి.. ఇస్లామిక్ పాలన నుంచి స్వేచ్ఛ లభించింది అనటం సరికాదు. దానికో చక్కని పోలిక చెప్పొచ్చు. ఏ రోజు అయినా బ్రిటీష్ పాలకుల నుంచి విముక్తి అంటున్నామే తప్పించి.. క్రిస్టియన్ల పాలన నుంచి విముక్తి అనటం లేదు కదా?
- తెలంగాణాను ఇస్లామిక్(నిజామ్) పాలన నుంచి విముక్తం చేయడానికి వచ్చిన భారత సైన్యంపై పోరాడింది - మజ్లిస్.. నిజామ్.. రజాకార్లు.
ఈ వాదనలోనూ సత్యాల కంటే కూడా అసత్యాలే ఎక్కువగా ఉన్నాయి. భావోద్వేగాల్ని తట్టి లేపేలా అక్షరాల్ని రాసే క్రమంలో.. తాము అబద్ధాల్ని నిజాలుగా.. తమ మనసులోని భావాలే వాస్తవాలుగా ప్రచారం చేస్తున్నామన్నది మర్చిపోకూడదు. నిజాంను ఇస్లామ్ పాలకుడు అనే దానిలోనే వేర్వేరు లెక్కలు ఉన్నాయి. ఇక.. భారత సైన్యం మీద పోరాడిన వారిలో మజ్లిస్ ఉందనటంలో అర్థం లేదు. నిజాం.. రజాకార్లు పోరాడలేదు..భారత సైన్యం సైజు చూసి భయపడి రాజీ చేసుకున్నారు అనక లొంగారని చెప్పొచ్చు.
- 1927లో నవాబు సధార్ యార్ జంగ్... మజిల్స్ -ఇత్తె హాదుల &- ముస్లిమీన్ ( మజ్లిస్ ) స్థాపించబడినది . తొలిదశలో ఈ సంస్థ సంస్కృతిక రంగానికి , "ముస్లింల వికాసానికి" ప్రయత్నం చేసింది .తరువాత కాలంలో దీనికి "బహదూర్ ఆలీ జంగ్" అధ్యక్షుడయ్యాడు. ఇతనే ఇక్కడ మొట్ట మొదటిసారిగా "రజాకార్" అనే పదం వాడాడు. రజాకార్ అంటే "స్వచ్చంధసేవకుడు" వీళ్ళు నిజాం కార్యక్రమాలకు స్వచ్చందంగా పని చేశారు. తర్వాతి కాలంలో ఈ సంస్థకు "ఖాసీం రజ్వీ" అధ్యక్షత వహించాడు .
ఇందులోనూ అర్థసత్యాలే ఎక్కువ. కొంత మాత్రమే నిజాలు ఉన్నాయి. రజాకార్లకు నాయకత్వం వహించిన ఖాసీం రజ్వీ అత్యంత దుర్మార్గుడు.. రక్తపిశాచి. ఆ విషయంలో మరో మాటకు తావు లేదు. నిజాం నవాబు మాటల్ని లెక్క చేయలేదు. మరో మాటలో చెప్పాలంటే.. ఒక దశలో ఆయన్ను లెక్క చేయకుండా వ్యవహరించేవాడనటంలో అర్థముంది.
- బహదూర్ ఆలీ జంగ్ ... "అనీ మాలిక్" అనే నినాదం ఇచ్చాడు. అంటే.. ప్రతీ ముస్లిం పరిపాలకుడే అని అర్ధం. ఖాసీం రజ్వీ .... రజాకార్లను సైనిక శక్తిగా మార్చాడు. ఇతని స్వస్థలం మహారాష్ట్రలోని లాతూర్ . రజాకార్లలో మొత్తం 50 వేల మంది సైనికులు ఉండేవారు, విసూనూరి దేశముఖ్, రామచంద్రా రెడ్డి దీనికి డిప్యూటీ కమాండర్లుగా పనిచేశారు . ఖాసీం రజ్వీ ఆస్ట్రేలియా లోని సిడ్నీ కాటన్ వద్ద ఆయుధాలను కొనొగోలు చేశాడు.
ఒకరాజు తన వారిని.. తన వారసుల్ని ఏ రీతిలో అయితే పాలకులుగా అభివర్ణిస్తారో అలానే చూడాలే తప్పించి.. విపరీతార్థాలు తీయటం సరికాదు. మిగిలిన సమాచారం నిజాలే ఎక్కువ.
- రజాకార్ల దౌర్జన్యాలను భరించలేక హైదరాబాద్ కింగ్ కోఠి లోని మెయిన్ రోడ్డుపై 1947 డిసెంబర్ 4 న నిజాం నవాబుపై బాంబుల దాడి జరిగింది. ఈ దాడిలో నారాయణ పవార్, జగదీశ్వర్ ఆర్యా , గండయ్య లు పాల్గొన్నారు. రాజకార్లు నిజాం ప్రధానమంత్రి నవాబ్ చెత్తారిపై "శ్యామంజిల్" లో దాడి చేశారు. దీనిపై నిజాం స్పందించలేదు . 9 ఆగస్టు 1948 వరంగల్ లో బత్తిని మొగిలయ్య గౌడ్ ని హత్య చేశారు
ఇంతకు ముందే చెప్పినట్లుగా ఒక స్థాయి దాటిన తర్వాత ఖాస్వీం రజ్వీ నిజాం రాజును లెక్క చేయకుండా వ్యవహరించటం మొదలుపెట్టిన క్రమంలో జరిగిన పరిణామాలుగా చెప్పాలి.
- ఆగస్టు 22, 1948 లో కాచిగూడలో ఒక ప్రముఖ పత్రికా విలేఖరి అయిన "షోయాబుల్లా ఖాన్" అనే వ్యక్తిని రజాకార్లకు వ్యతిరేకముగా రాసినందుకు నిర్ధ్యక్షిణంగా హాత్య చేశారు .
ఇదంతా నిజమే.
- ఆరాచకాలకు వ్యతిరేకంగా తెలంగాణా ఉద్యమకారులు తిరుగుబాటు జండా ఎగురవేశారు. సాయుధ పోరాటానికి నాంది పలికారు. వీళ్ళను అణగద్రొక్కడానికి రజాకార్లను ఉపయోగించి దారుణ మారణఖాండకు తెర తీశారు. అనేకమంది అమాయకపు హిందువులను, చిన్నా పెద్దా అనీ తారతమ్యం లేకుండా కనబడ్డవారిని కనపడ్డట్టుగా చిత్రవధలతో చంపేశారు. అనేక హిందూమతాల దేవాలయాలు ధ్వంసం చేశారు , ఆస్తుల భూములు , లాగేసుకున్నారు .ప్రజలను భయబ్రాంతులను చేస్తూ, బలవంతపు మతమార్పిడులు చేశారు.
ఇందులో చాలా వరకు నిజాలే ఉన్నాయి.
- రజాకార్ల కారణంగా భైరాంపల్లి , పరకాల , పేరుమడ్ల , సంకీర్త , ధర్మారం , ఊయలవాడ ,భువనగిరి ,సూర్యాపేట మొదలగు గ్రామాలపై దాడులు చేసి వేలాది మంది హిందువులను నిర్ధ్యాక్షిణంగా చంపేశారు. ఆడవారిని.. పసిపిల్లలను గర్భవతులను భర్త చూస్తుండగా కత్తులతో కడుపులు కోసి పసిపిల్లలను బయటికి లాగారు . హిందూ మహిళల ఒంటిపైన ఉన్న వస్త్రాలను విప్పించి నడి రోడ్డుపై బతుకమ్మ ఆటలు ఆడించారు. ఆడవారి రొమ్ములను తూకం వేసి బరువును లెక్కగట్టి పన్నులు వసూలు చేశారు .ఈ అమానుషాలన్ని చాలావరకు నిజాలే.
- ఉక్కుమనిషి సర్ధార్ పటేల్ జోక్యంతో నిజాం సంస్థానం భారత ప్రభుత్వంలో కలిపారు. ఒకవేళ నైజాం సంస్థానం కేరళలో మాదిరిగా ఉండినట్టయితే ఈ పాటికి మొత్తం రాష్ట్రం మతమార్పిడులు దాడులు జరిగి హిందువు అనేవాడే లేకుండా మొత్తం ముస్లింలతో నిండిపోయి ఉండేది .
ఇలాంటి మాటలే తప్పుడు భావనలకు కారణమవుతాయి. ఇందులో వాస్తవం కంటే ఊహాగానమే ఎక్కువగా ఉందని చెప్పాలి. వార్తకు.. వ్యాఖ్యానానికి ఉన్న తేడాకు తగ్గట్లే ఈ మాటల్ని చెప్పొచ్చు.
- నిజాం అంత మంచోడే అయితే తెలంగాణ లో అంత నిరక్షరాస్యత ఎందుకో? మెజార్టీ ప్రజలు మాట్లాడే భాష కాకుండా పిడికెడు మంది మాట్లాడే ఉర్దూ ఎందుకు అధికార భాష అయింది. ఉర్దూని బలవంతంగా రుద్ది స్వచ్ఛమైన తెలుగును బ్రష్టుపట్టించింది నిజాం కాదా..?? సంస్కృతిని, సాంప్రదాయాలను నాశనం చేయలేదా? బలవంతపు మత మార్పిడీలు చేయలేదా? ఇప్పుడున్న ముస్లిమ్స్ లో 90% మంది మన పూర్వీకులు హిందువులు కాదా?
ఇలాంటి వ్యాఖ్యలన్ని కూడా భావోద్వేగాల్ని తట్టి లేపేవి. ఒక చట్రంలో చిక్కుకొని చేసే వ్యాఖ్యలుగా చెప్పాలి. వీటిల్లో వాస్తవాల కంటే కూడా ఊహాశక్తితో రాసిన వ్యాఖ్యానాలే అధికమని చెప్పాలి. అదెలానో చిన్న ఉదాహరణతో చెబుతాం. నిరక్షరాస్యత ఎందుకు? అని ప్రశ్నించిన వేళ.. హిందూ రాజులు పాలనలో ఉన్న రాజ్యాల్లోని ప్రజల్లో నిర్దక్ష్యరాస్యత అస్సలు లేదా? అన్న ప్రశ్న వేసుకుంటే.. ఈ మాటల్లోనిజాలేమిటో ఇట్టే అర్థమైపోతుంది.
- 60 యేండ్లు దోసుకుంటే ఆంధ్రోడు దోసుకున్నాడు అంటిమి, 350 యేండ్లు దోసుకున్నోన్ని మాత్రం దేవుడు అనవడితిరి.
ఇందులోనూ నిజం లేదు. ఆంధ్రోడు దోచుకున్నాడన్న మాటే తప్పు. ఇక.. నిజాంను దేవుడు అంటూ కీర్తించేవారు లేరు. కాకుంటే..ఆయనలోని మంచిని.. చెడును తూకం వేసినట్లు చెప్పటం తప్పేం కాదు కదా? దానికి కాసింత మసాలా జోడించి చేసిన వ్యాఖ్యలుగా చెప్పాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.