రాజీవ్ ను ఒప్పించేందుకు ఆమెను పంపిన ఇందిర‌

Update: 2017-12-11 05:46 GMT
ఇప్ప‌టివ‌ర‌కూ బ‌య‌ట‌కు రాని కొత్త విష‌యం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.  రాజీవ్ గాంధీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు కార‌ణ‌మైన ఒక ఆస‌క్తిక‌ర‌మైన అంశం వెలుగులోకి వ‌చ్చింది. తాజాగా విడుద‌లైన ఒక పుస్త‌కంలో రాజీవ్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశానికి కార‌ణ‌మైన విష‌యాల్ని వెల్ల‌డించారు. అంతేకాదు.. దివంగ‌త ప్ర‌ధాని ఇందిరాగాంధీకి సంబంధించి పెద్ద‌గా వెలుగుచూడ‌ని ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన ఒక అంశం బ‌య‌ట‌కు వ‌చ్చింది

ఇందిర‌కు చిన్న‌త‌నం నుంచేవివాదాస్ప‌ద అధ్యాత్మిక‌వేత్త అయిన ఓషో అంటే ఆస‌క్తి అని.. ఆయ‌న సూక్తుల‌కు ఆమె ప్ర‌భావితం అయ్యేవార‌ని  ద ఓన్లీ లైఫ్: ఓషో.. ల‌క్ష్మి అండ్ ద వ‌ర‌ల్డ్ ఇన్ క్రైసిస్ అనే పుస్త‌కంలో ర‌చ‌యిత ర‌షీద్ మాక్స్ వెల్ వెల్ల‌డించారు.

ఇందిర‌కు ఎంతో ఆస‌క్తి చూపే ఓషో వివాదాస్ప‌దుడు కావ‌టంతో ఎప్పుడూ ఆయ‌న ఆశ్ర‌మాన్ని ఇందిర సంద‌ర్శించ‌లేదు.  అయితే.. 1980లో ప్ర‌ధాని అయ్యాక ఆమె పెద్ద కుమారుడు సంజ‌య్ గాంధీ విమాన ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. ఆ స‌మ‌యంలో ఇందిర వ‌ద్ద‌కు ఓషో కార్య‌ద‌ర్శి ల‌క్ష్మి వ‌చ్చారు.

ఈ సంద‌ర్భంగా ల‌క్ష్మిని ఇందిర ఒక సాయాన్ని కోరార‌ని.. పైలెట్ గా ప‌ని చేస్తున్న రాజీవ్ గాంధీని రాజ‌కీయాల్లోకి వ‌చ్చేలా ఒప్పించాల‌ని కోరిన‌ట్లుగా పేర్కొన్నారు. రాజీవ్ గ‌దిలోకి వెళ్లిన ల‌క్ష్మి ఆయ‌న‌తో చాలాసేపు మాట్లాడి రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు ఒప్పించిన‌ట్లుగా తాజా పుస్త‌కంలో వెల్ల‌డించారు. మ‌రి.. దీనిపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు ఎలా స్పందిస్తారో?
Tags:    

Similar News