రెండున్నరేళ్ల క్రితం చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి నేటికీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. అనేక దేశాల్లో లక్షల సంఖ్యలో కొత్త కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. వైరస్ బారిన పడిన చాలా మంది చనిపోతున్నారు. కేవలం గడనిచిన ఇరవై నాలుగు గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా 20 లక్షల మందికి కరోనా మహమ్మారి సోకిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే వైరస్ తో చనిపోయిన వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. అత్యధికంగా ఫ్రాన్స్ లో కేవలం ఒక్క రోజులోనే మూడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆ దేశం లో వైరస్ కారణంగా 175 మంది మృత్యువాత పడ్డారు. ఇదిలా ఉంటే భారతదేశంలో కూడా వైరస్ ఉదృతి కొనసాగుతోంది. ఈ ఒక్కరోజు సుమారు రెండు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా వైరస్ తో చనిపోయిన వారి సంఖ్య గతంతో పోలిస్తే మరింత పెరిగింది. ఈ ఒక్క రోజులోనే 893 మంది చనిపోయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో రోజువారి పాజిటివ్ రేటు 14 శాతానికి పైగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే కరోనా వైరస్ అనేదీ ప్రతిసారీ తన రూపం మార్చుకుని సరికొత్త వేరియంట్ లతో ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త వైరస్ గబ్బిలాల్లో బయటపడినట్లు చైనాకు చెందిన పరిశోధకులు తెలిపారు. దీని పేరే నియోకొవ్. అయితే చైనాకు సంబంధించిన పరిశోధకులు చెప్పిన దాని ప్రకారం ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఇది సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోతారని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం వీరు చెప్పిన మాటలే చాలా మందిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. కానీ ఈ వైరస్ అనేది గబ్బిలం నుంచి జంతువులకూ వ్యాపిస్తుందని ఇప్పటికే వివిధ పరిశోధనల్లో స్పష్టమైంది. అయితే జంతువుల నుంచి మానవులకు సోకే ప్రమాదంపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. పూర్తిస్థాయిలో ఇందుకు సంబంధించిన సమాచారం ప్రపంచంలోనే ఎవరి దగ్గర లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఇప్పటికే తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు చాలా మంది కంగారుపడుతున్నారు.
నియోకోవ్ అనేది మానవులకు సోకాలి అంటే కనీసం ఒక్క మ్యూటేషన్ అయినా జరగాల్సి ఉంటుంది. కానీ కరోనా లాగా నియోకోవ్ వ్యాప్తి చెందడానికి ఇంకా సమయం ఉందని నిపుణులు చెప్తున్నారు. దీనికి తోడు ఈ వైరస్ ఇప్పటి వరకు ఎవరికీ సోకలేదు అనే వార్త ప్రస్తుతం కొంతమేర ఉపసమనాన్ని ఇస్తుం౦ది. కానీ మ్యూటేషన్ అనేది జరిగి మానవులకు సోకితే దానిని ఆపడం చాలా కష్టం అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కరోనా వైరస్ లాగా నియోకోవ్ కు ప్రత్యేకమైన జాతి ఉంది. ఈ వైరస్ ఎంఈఆర్ఎస్ కోవ్ రకానికి చెందింది. దీంతో మ్యూటేషన్ చెందే అవకాశం కూడా లేకపోలేదు. ఇదే జరిగితే మరోసారి కేసులు. ఈ వైరస్ తో చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీని ప్రధాన కారణం.. ఈ వైరస్ సోకిన వారిలో చనిపోయే ప్రమాదం 35 శాతం ఉన్నట్లు పరిశోధకులు చెప్తున్నారు.
నియోకొవ్ అనేది కనీసం ఒక్క మ్యూటేషన్ జరిగితేనే మానవులకు సోకుతుంది. అయితే ఇలా మానవులకు సోకితే కానీ పూర్తిస్థాయిలో దీనికి సంబంధించిన సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ ఇప్పటికే స్పష్టం చేసింది. దీన్ని బట్టి చూస్తే మానవులకు సోకేదాని ప్రకారం ఈ వైరస్ తీవ్రత ఎంత అనేది అంచనా వేయవచ్చని అర్థమవుతుంది. ఇదే విషయాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిశోధకులు కూడా చెబుతున్నారు. ఈ వైరస్ కు సంబంధించి మరింత పరిశోధన జరిపితే కానీ కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం లేదని అంటున్నారు. దీనిపై పరిశోధన చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ తో పాటు జంతు ఆరోగ్య సంస్థ అధ్యయనాలు చేపట్టాయి.