హైదరాబాద్ నిజాం విషయంలో నెలకొన్న పంచాయతీ కేంద్ర హోం శాఖ వద్దకు చేరింది. వారసత్వం విషయంలో మొదలైన ఈ పేచీపై స్పష్టత విషయంలో హోం శాఖకు నిలదీతల పర్వం ఎదురైంది. హైదరాబాద్ సంస్థాన పాలకుడిగా మీర్ బర్కత్ అలీఖాన్ (నవాబ్ ముకరంజా బహద్దూర్)ను గుర్తించిన ప్రభుత్వ రికార్డులు ఎక్కడున్నాయని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) కేంద్ర హోంశాఖను ప్రశ్నించింది. 50 ఏళ్ల క్రితం నాటి కీలకమైన ఆ దస్ర్తాల గురించి తమకు తెలియదన్న హోంశాఖ సమాధానాన్ని సీఐసీ తప్పుపట్టింది.
వివరాల్లోకి వెళితే...హైదరాబాద్ సంస్థానానికి చివరి రాజైన మీర్ ఉస్మాన్ అలీఖాన్.. తన వారసుడిగా మనుమడు ముకరంజాహ్‌ను గుర్తించాలంటూ భారత ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు ప్రిన్స్ మీర్ బర్కత్ అలీఖాన్ (ముకరం జా బహద్దూర్)ను నిజాం ఆఫ్ హైదరాబాద్ గా గుర్తిస్తూ నిజాం మరణించిన రోజు (1967 ఫిబ్రవరి 24) నుంచీ ఆ హోదాలో కొనసాగేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఉస్మాన్ అలీఖాన్ మరణం తర్వాత నిజాం వారసుల్లో గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్టికల్ 366(22) కింద 1967లో జారీ అయిన సర్టిఫికెట్ కాపీని పొందిన సయ్యద్ ఖాలిక్ అనే వ్యక్తి దానికి సంబంధించిన ప్రభుత్వ దస్ర్తాల కాపీలను కోరుతూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఆ రికార్డులేవీ కనబడటం లేదని కేంద్ర హోంశాఖ సమాధానమివ్వగా - ఆ ఫైళ్లు తమ వద్దకు రాలేవంటూ నేషనల్ ఆర్కైవ్స్ తెలిపింది. దీనిపై ఆయన కేంద్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించాడు.
చారిత్రక ప్రాధాన్యమున్న కీలకమైన ఫైళ్లను గుర్తించి వాటిని నేషనల్ ఆర్కైవ్స్ కు అప్పగించాలని, అందుకోసం ఓ కమిటీని వేయాలని సమాచార కమిషనర్ యశోవర్ధన్ ఆజాద్ సూచించారు. ఈ మేరకు ఆయన హోంశాఖ కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేశారు. ముకరంజాహ్‌కు ఆ హోదాతో సర్టిఫికెట్ అందజేసినట్లు రికార్డుల్లో ఉన్నందున అది కచ్చితంగా హోంశాఖ వద్దే ఉండి ఉండాలని సమాచార కమిషనర్ యశోవర్ధన్ ఆజాద్ అభిప్రాయపడ్డారు. ఆ పత్రాలను వెతికిపట్టుకోవాలని హోంశాఖను ఆయన ఆదేశించారు.