టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మధ్యన కనిపించట్లేదు. నిత్యం రెండు..మూడు ప్రోగ్రాంలో మిస్ కాకుండా పాల్గొనే ఆయన.. గడిచిన కొద్ది రోజులుగా ఆయన ఎక్కడా కనిపించని పరిస్థితి. దాదాపుగా పది రోజుల నుంచి పేపర్లలో ఆయన ఫోటో కూడా దర్శనం ఇవ్వట్లేదు. మిగిలిన మీడియా సంస్థల్ని వదిలేసినా.. సొంత మీడియా సంస్థలోనూ ఆయనకు సంబంధించిన వార్తలు లేకపోవటం ఆసక్తికరంగా మారింది.
ఇంతకీ ఆయన ఎక్కడికి వెళ్లినట్లు? ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు? అన్న క్వశ్చన్లకు సమాధానాలు దొరకటం లేదు. సాధారణంగా కేసీఆర్ స్థాయి నేతలు ఫారిన్ టూర్లకు వెళుతుంటే.. ముందు నుంచి ఆ విషయాల్ని ప్రస్తావిస్తుంటాయి. అధికారిక పర్యటన కాదు.. అనధికార పర్యటన అయినా.. దానికి సంబంధించి నాలుగు ముక్కల ప్రెస్ నోట్ రిలీజ్ అవుతుంటుంది.
అందుకు భిన్నంగా ఎలాంటి సమాచారం లేకుండానే కేటీఆర్ కనిపించటం లేదన్న మాట టీఆర్ ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రధాన మీడియాలో కనిపించని కేటీఆర్.. అందుకు భిన్నంగా సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు ట్వీట్లు చేస్తున్నారు. తాను యాక్టివ్ గా ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. మీడియాలో కనిపించని కేటీఆర్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉన్నట్లు కనిపిస్తూ కొన్ని ట్వీట్లు చేస్తున్నారు. పలువురు సందేహాల్ని తీరుస్తూ.. తానున్నట్లే వ్యవహరిస్తున్నారు.
ఒకవేళ హైదరాబాద్ లోనే కేటీఆర్ ఉంటే.. ఇన్ని రోజులు బయటకు రాకుండా ఉంటారా? అన్నది ప్రశ్న. అదే సమయంలో ఎక్కడికైనా పర్యటనకు వెళ్లి ఉంటే.. దానికి సంబంధించిన సమాచారం ఇప్పటికే వచ్చి ఉండాలి. కానీ.. ఇవేమీ జరగకుండా.. కేటీఆర్ కనిపించకుండా ఉండటం ఏమిటన్నది ప్రశ్న. ఆసక్తికర అంశం ఏమంటే.. ఇప్పుడీ ప్రశ్నకు సమాధానం సొంత పార్టీ నేతలు కూడా ఇవ్వలేకపోవటం చూసినప్పుడు.. కేటీఆర్ ఎక్కడ? ఏం చేస్తున్నారు? ఎప్పుడు జనాలకు దర్శనమిస్తారన్న భావన కలుగక మానదు.