శివాజీ శ్రీలంకలో ఉన్నాడా..?

Update: 2019-06-11 05:02 GMT
ఒకవైపు టీవీ నైన్ మాజీ సీఈవో రవి ప్రకాష్ పోలీసుల విచారణను ఎదుర్కొంటూ ఉన్నాడు. తనపై నమోదు అయిన వివిధ కేసుల గురించి అతడు పోలిస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అతడిని అరెస్టు చేయడానికి పోలీసులు కోర్టు అనుమతి కోసం ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. మరోవైపు ఇదే సందర్భంలో చర్చలో ఉన్న మరో అంశం.. ఇంతకీ శివాజీ ఎక్కడ? అనేది.

టీవీ నైన్ వ్యవహారంలో రవి ప్రకాష్ తో కలిసి శివాజీ చాలా వ్యవహారమే నడిపించారని నూతన యాజమాన్యం చెబుతూ ఉంది. టీవీ నైన్ చేతులు  మారడాన్ని సహించలేని రవి ప్రకాష్ తన వాటాలను కొద్ది మేరే శివాజీ పేరుకు బదలాయించి - వివాదాన్ని రాజేయాలని చూశాడని నూతన యాజమాన్యం చెబుతోంది. అందుకు సంబంధించి కూడా కేసులు నమోదు అయ్యాయి. రవి ప్రకాష్ - శివాజీలు ఒక కట్టుకథను అల్లారని - తప్పుడు తేదీలతో పత్రాలను సృష్టించారని కూడా అభియోగాలు నమోదు అయ్యాయి.

ఈ నేఫథ్యంలో ఈ కేసులో శివాజీకి కూడా పోలీసుల నుంచి నోటీసులు వెళ్లాయి. రవి ప్రకాష్ అయినా పోలీసుల ముందుకు వచ్చాడు. అయితే శివాజీ మాత్రం ఇంకా పరారీలో ఉన్నట్టే అని పరిశీలకులు అంటున్నారు. ఒకసారి  వీడియో ఒకటి విడుదల చేసి.. తను పరార్ కాలేదని శివాజీ ప్రకటించుకున్నాడు.

అయితే ఇప్పుడు అతడి విషయంలో వేరే మాట వినిపిస్తూ ఉంది. శివాజీ శ్రీలంకలో ఉన్నాడని టాక్! అక్కడ ఒక క్యాసినోలో శివాజీ కొంతమందికి కనిపించాడట. ఒకవైపు తను పరార్ కాలేదని ప్రకటించుకుని శివాజీ అక్కడ సేదతీరుతూ ఉన్నాడని వారు అంటున్నారు. ఈ వ్యవహారంలో నిజమెంతో కానీ.. శివాజీ అలా పోలీసుల కళ్లను కప్పి శ్రీలంక చేరుకుని ఉన్నాడనే గాసిప్ మాత్రం గట్టిగా వినిపిస్తూ ఉంది!


Tags:    

Similar News