బడ్జెట్ సమావేశాలన్నంతనే.. విపక్షాలు.. మీడియా చూపు మొత్తం సెషన్ చివరి మీదనే ఉంటుంది. ఎందుకంటే.. ఆ రోజున కాగ్ నివేదికను సభ ముందుకు తీసుకొస్తారు. గడిచిన ఆర్థిక సంవత్సరం లో ప్రభుత్వ విభాగాలు చేసే తప్పులకు సంబంధించిన చిట్టా.. అధికారికంగా చేతికి అందుతుంది. కంపోల్టర్ అండ్ ఆడిటర్ జనరల్ సిద్ధం చేసే ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వంలోని వివిధ విభాగాల పనితీరు ఏ మేరకు ఉందన్నది ఇట్టే అర్థమవుతుంది.
ప్రతి బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజున ఇచ్చే ఈ నివేదికను ఈసారి తెలంగాణ ప్రభుత్వం సభ ముందుకు తీసుకురాకపోవటం ఆసక్తికరంగా మారింది. క్రమ తప్పకుండా నివేదిక ఇచ్చే సంప్రదాయాన్ని ఎలా స్కిప్ చేస్తారన్నది ప్రశ్నగా మారింది. బడ్జెట్ అంచనాలు.. వ్యయ లోటుపాట్లపైన కీలక సమాచారంతో పాటు.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అవసరమైన సమాచారం ఇందులో ఉంటుంది.
తాజాగా తెలంగాణ బడ్జెట్ సమావేశాలు సోమవారంతో పూర్తి అయ్యాయి. చివరి రోజున ఇవ్వాల్సిన కాగ్ నివేదిక టేబుల్ కాకపోవటం గమనార్హం. దీనికి కారణం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. షెడ్యూల్ కంటే కాస్త ముందుగా ఈ బడ్జెట్ సమావేశాలు ముగియటం తో.. కాగ్ నివేదిక సిద్ధం కాలేదని చెబుతున్నా.. అందులో వాస్తవం లేదంటున్నారు.
లెక్క ప్రకారం చేసినా.. ఈ నెల 20 వరకు మాత్రమే బడ్జెట్ సమావేశాలు జరగాల్సి ఉందని.. అనుకున్న దానికంటే కేవలం నాలుగు రోజుల ముందు సమావేశాల్ని ముగిస్తే.. దానికే కాగ్ నివేదిక ఇవ్వకుండా ఉండటమా? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు. కాగ్ నివేదికను ముందే సిద్ధం చేసి ఉంటారని.. చివరి రోజు వరకూ ప్రింట్ చేయకుండా ఉండే అవకాశం లేదంటున్నారు. మరెందుకు కాగ్ నివేదిక సభ ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు సమాధానం లభించని పరిస్థితి. అయితే.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కాగ్ నివేదికను ఇస్తారన్న మాటను అధికారపక్షానికి చెందిన సభ్యులు కొందరు ఆఫ్ ద రికార్డుగా చెప్పటం గమనార్హం.