అందరూ ఒకేలా ఉంటే ఇంకేం ఉంటుంది. కాకుంటే.. కొన్ని విషయాల్ని ఆలోచించేందుకు సైతం ఇష్టపడని రీతికి భిన్నంగా వ్యవహరించే శాడిస్టు ధోరణి గురించి తెలిసినంతనే అవాక్కు అవ్వటమే కాదు.. ఇలాంటోళ్లు కూడా ఉంటారా? అన్న భావన కలుగక మానదు. అలాంటి కోవకే చెందినోడు చవాన్ శ్రీరామ్.
యావత్ దేశమే కాదు ప్రపంచం లోని పలు దేశాల్లోనూ సంచలనంగా మారిన దిశ హత్యాచార ఉదంతం పై అందరూ అయ్యో అనుకుంటూ ఉన్నోళ్లే. ఇలాంటి ఘటన జరిగిన వైనంపై వేదన వ్యక్తం చేయటమే కాదు.. అంత దుర్మార్గానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది.
ఇలాంటివేళ.. అందుకు భిన్నంగా దిశ మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్న కొందరు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఇలాంటి వారు.. తమ మనసులోని కుళ్లును సోషల్ మీడియా లో పోస్టు చేస్తుంటారు. దిశ ఉదంతం తర్వాత ఆమెపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన వైనంపై పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్ కు చెందిన చవన్ శ్రీరామ్ దిశ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. దీనిపై పలువురు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్టాలిన్ శ్రీరామ్ పేరుతో ఉన్న ఈ ఖాతా పై నిఘా పెట్టిన పోలీసులు తాజాగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
దిశ ఉదంతం పై నలుగురు యువకులు సోషల్ మీడియా లో నీచమైన వ్యాఖ్యలు చేశారు. వీరిలో స్మైలీ నానీ పేరుతో అసభ్య పదజాలంతో పాటు.. అశ్లీల వీడియోను పోస్టు చేశారు. ఇతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రాధమికంగా అందుతున్న సమాచారం ప్రకారం అతడ్ని గుంటూరులో ఉన్నట్లు గుర్తించారు. త్వరలోనే అదుపులోకి తీసుకుంటారని హైదరాబాద్ పోలీసులు చెబుతున్నారు. ఏమైనా.. సోషల్ మీడియాలో విషం కక్కే ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది.