తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల లో కొందరు వైసీపీ లో చేరబోతున్నారంటూ కొద్దికాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై ఇంత వరకు ఊహా గానాలే కానీ ఎవరెవరు చేరుతారన్న విషయం లో ఇంతవరకు ఎక్కడా క్లారిటీ లేదు. ఇలాంటి సమయంలో వైసీపీ కి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి ఈ అంశాన్ని చర్చలోకి తెచ్చారు. టీడీపి కి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ ఆయన అన్నారు. గతంలోనూ కోటం రెడ్డి ఇదే తరహాలో చెప్పినా ఒక్క వల్లభనేని వంశీ తప్ప ఇంకెవరూ టీడీపీని వీడలేదు. కాగా, కోటంరెడ్డి మరోసారి ఫిరాయింపులకు సంబంధించి కామెంట్ చేయడంతో ఆయన చెప్పినట్లు వైసీపీ లోకి వెళ్లబోయే 13 మంది ఎమ్మెల్యేలు ఎవరా అన్న చర్చ జరుగుతోంది. తెలుగుదేశం కూడా తమ పార్టీ ఎమ్మెల్యే లలో ఆ బ్లాక్ షీప్స్ ఎవరా అని అనుమానంగా చూస్తోందట. అయితే... 13 మంది లెక్క దొరకడం లేదని చెబుతున్నారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ కోటంరెడ్డి చెబుతున్నారు... సీఎం జగన్ ఆదేశిస్తే వెంటనే వారంతా వైసీపీలో వచ్చి చేరతారంటున్నారు. జగన్ నిర్ణయం కోసం ఆ 13 మంది ఎమ్మెల్యేలు వేచి చూస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇకపోతే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఉందంటే అది జగన్ పుణ్యమేనంటూ చెప్పుకొచ్చారు. వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలకు జగన్ షరతులు పెట్టకుండా ఉంటే ఎప్పుడో చంద్రబాబు ప్రతిపక్ష హోదా గల్లంతయ్యేదని చెప్పుకొచ్చారు.
అయితే... ఇప్పటికిప్పుడు కాకున్నా కొద్దిరోజుల తరువాత టీడీపీని ఖాళీ చేయాలన్న ఉద్దేశం తో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందంటూ కోటంరెడ్డి చెప్పుకొస్తున్నారు.
కాగా కోటంరెడ్డి వ్యాఖ్యల పై టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ‘‘మీ జిల్లాకే చెందిన ఆనం రామనారాయణ రెడ్డి ని వైసీపీ నుంచి వెళ్లిపోకుండా కాపాడుకోండి.. అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడొచ్చు’’ అంటున్నారు.