కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి సోనియాగాంధీ తప్పుకున్నారని.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఏఐసీసీ కొత్త అధ్యక్షుడిని చేశారని వార్తలొచ్చాయి. కానీ అధికారికంగా మాత్రం కాంగ్రెస్ ఇప్పటివరకు ప్రకటించలేదు. దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిన మన్మోహన్ ను ప్రధానిని చేయాలని కాంగ్రెస్ డిసైడ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.
అయితే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉత్తరాది వారే ఉంటున్నారు. ఇన్నాళ్లు గాంధీ కుటుంబం చేతుల్లోనే ఉంది. అయితే ఇప్పుడు దక్షిణాది వారికి ఇవ్వొచ్చు కదా అన్న డిమాండ్ కూడా కాంగ్రెస్ లో వినిపిస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా సౌత్ ఇండియా వ్యక్తికి ఇవ్వాలని కాంగ్రెస్ వర్గాల్లో ఒక వాదన కూడా మొదలైనట్టు టాక్
దక్షిణాది నుంచి కాంగ్రెస్ లో శశిథరూర్ మరియు సిద్ధ రామయ్య మధ్య పోటి ఉందని సమాచారం. అయితే శశిథరూర్ అంతర్జాతీయంగా పేరు ఉంది. ఆయన మాజీ కేంద్రమంత్రిగా.. విశ్లేషకుడిగా పేరు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో కూడా అతని పేరు బాగా వినిపిస్తోంది. అందులోనూ కేరళ నుంచే రాహుల్ గాంధీ ఎంపీ కాబట్టి సౌత్ ఇండియాకు ఇవ్వాలని గాంధీ కుటుంబం డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.
అయితే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తన చేతుల్లోంచి అధ్యక్ష పదవి పోయినా స్వయం అధికారం పోవద్దనే భావనలో ఉన్నారు. మన్మోహన్ ను ఉత్సవవిగ్రహంగా ముందుపెట్టి గతంలో దేశాన్ని పాలించినట్టే కాంగ్రెస్ ను పాలించాలనే మన్మోహన్ నే కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయాలని ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి దక్షిణాది వ్యక్తి డిమాండ్ ఏ మేరకు నెరవేరుతుందో చూడాలి.