చంద్ర‌బాబు వెనుక ఉన్న‌ది ఎవ‌రు..?!

Update: 2018-07-07 07:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పాల‌న చేయ‌డం లేద‌ని - ఆయ‌న వెనుక ఎవ‌రో ఉన్నార‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు - ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఇన్నాళ్లు చంద్ర‌బాబు నాయుడి పాల‌న‌పైనే మండిప‌డ్డ సోము వీర్రాజు ఇప్పుడు ఏకంగా చంద్ర‌బాబును న‌డిపిస్తున్న‌ది వేరేవ‌రో అని తెల్చ‌డంతో రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ - సామాన్యుల‌లోనూ చ‌ర్చ ప్రారంభమైంది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత  జ‌రిగిన ఎన్నిక‌ల్లో మంత్రి నారాయ‌ణ అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత కూడా ఆయ‌న పెత్త‌నం ఎక్కువే అయ్యింది. దీనిపై పార్టీలో సీనియ‌ర్లు కూడా చంద్ర‌బాబు నాయుడిపై గుర్రుగా ఉండేవారు. ఆ త‌ర్వాత నారాయ‌ణ హ‌వా త‌గ్గ‌డం ప్రారంభ‌మైంది. ఈ మ‌ధ్య‌లోనే చంద్ర‌బాబు నాయుడు వేరెవ‌రి అడుగుజాడ‌ల్లోనైనా న‌డ‌వ‌డం ప్రారంభించారా అన్న‌ది ప్ర‌స్తుత చ‌ర్చ‌.

చీటికి మాటికి దేశంలో అంద‌రి కంటే నేనే సీనియ‌ర్ ని - నేనే అన్ని రంగాల‌ను ముందుకు న‌డిపించాన‌ని చెప్పుకునే చంద్ర‌బాబు నాయుడు వెనుక ఎవ‌రున్నార‌నే అంశం ఇన్నాళ్లు చ‌ర్చ‌ల్లోకి రాలేదు. తాజాగా భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కుడు సోము వీర్రాజు ఈ అంశంపై మాట్లాడ‌డంతో చంద్ర‌బాబు ఎవ‌రి అడుగుజాడ‌ల్లో న‌డుస్తున్నారా అని సందేహాలు క‌లుగుతున్నాయి. ఇంత‌కు ముందు స‌మైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రిగానూ - ప్ర‌తిప‌క్ష నేత‌గానూ ఉన్న స‌మ‌యంలో చంద్ర‌బాబు నాయుడు ఈనాడు పత్రిక య‌జ‌మాని - కింగ్ మేక‌ర్ గా పిలిపించుకున్న రామోజీరావు అడుగుజాడ‌ల్లో న‌డిచే వారు. అయితే రాష్ట్రం విడిపోవ‌డానికి కొన్ని రోజుల మందు నుంచే చంద్ర‌బాబు నాయుడి వ్య‌వ‌హార‌శైలి న‌చ్చ‌ని రామోజీరావు ఆయ‌న్ని ప‌క్క‌న పెట్టారు. రామోజీ రావు స్వ‌యంగా చంద్ర‌బాబు నాయుడితో మాట్లాడి చాలాకాల‌మైంద‌ని వారిద్ద‌రి గురించి తెలిసిన వారు చెప్తారు. తాజాగా చంద్ర‌బాబు నాయుడి వెనుక ఎవ‌రున్న‌ది తెలియాల్సి ఉంది. రాష్ట్రం విడిపోయిన త‌ర్వాత రాజ‌ధాని నిర్మాణం పేరుతో చంద్ర‌బాబు నాయుడు త‌న ప‌రివారంతో చీటికి మాటికీ విదేశాలు వెళ్తున్నారు. త‌ర‌చుగా సింగ‌పూర్ వెళ్తున్న చంద్ర‌బాబు నాయుడు అక్క‌డున్న త‌మిళ వారితో స‌న్నిహితంగా ఉంటున్నార‌ని క‌థ‌నాలు కూడా వ‌స్తున్నాయి. రాజ‌ధాని నిర్మాణానికి వేలాది కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారు. ఈ ప‌నుల‌న్నీ సింగ‌పూర్ వారికే అప్ప‌గిస్తున్నారు. దీంతో చంద్ర‌బాబు నాయుడు వెనుక సింగ‌పూర్ కు చెందిన బ‌డాబాబే ఉన్న‌ట్లుగా అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇటీవ‌ల స‌ల‌హాదారు ప‌ద‌వికి రాజ‌నామా చేసిన ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ ఈ వ్య‌వ‌హారాల‌ను చూస్తున్నార‌ని అంటున్నారు. భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన సోము వీర్రాజు ప్ర‌భుత్వాధినేత వెనుక ఎవ‌రో ఉన్నారు అన‌డం.. జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే సింగ‌పూర్ సిన్నోడితో జ‌త క‌లిసారేమో అనిపించ‌క‌మాన‌దు.
Tags:    

Similar News