రికెట్ ..ఈ పదానికి ప్రపంచం మొత్తం అభిమానులు ఉన్నారు. క్రికెట్ అనేది ప్రపంచానికి ఒక పదం కావచ్చు ..కానీ, మనదేశంలో క్రికెట్ అంటే ఒక మతం. ప్రపంచం మొత్తం అభిమానించే క్రికెటర్ మాత్రం మన భారతదేశంలో ఉన్నాడు. అతను మరెవరో కాదు ..ఒక సాధారణ ఆటగాడిగా క్రికెట్ లోకి అడుగుపెట్టి ..నేడు క్రికెట్ కె దేవుడిగా మారిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. సచ్చిన్ ఒక్కడిని అవుట్ చేస్తే చాలు, విజయం మనదే అనుకునేవారు .
ఇక కాలం మారే కొద్ది క్రికెట్ లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇక ఫాస్ట్ ఫార్మాట్ రూపంలో టీ20లు వచ్చిన తర్వాత క్రికెట్ రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. కేవలం 20 ఓవర్లలో 200 పరుగులని కూడా చాలా ఈజీగా కొట్టేస్తున్నారు. అలాగే టీమిండియాకు ఐపీఎల్ పుణ్యమా అని ఎంతోమంది ఆటగాళ్లు.. టీ20 స్పెషలిస్టులుగా మారిపోయారు. ఒక్కసారి క్రీజ్ లో నిలదొక్కుకుంటే వారిని ఆపడం ఎవరితరం కాదు. బంతి పడటం ఆలస్యం స్టేడియం దాటాల్సిందే. ఇకపోతే సచిన్ టెండూల్కర్ తర్వాత నెక్స్ట్ క్రికెట్ కి గాడ్ ఎవరు అంటే.. అందరూ క్షణం కూడా ఆలోచించకుండా టీమిండియా రథసారథి విరాట్ కోహ్లీ అని అందరూ చెప్తారు. కానీ , తాజాగా టీ20 ఫార్మాట్‌కు మాత్రం కొత్త గాడ్ గా డాషింగ్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అవతరించాడు.
రోహిత్ శర్మ ..అభిమానులు ముద్దుగా హిట్ మ్యాన్ అని పిలుచుకుంటారు. రోహిత్ ఒక్కసారి క్రీజ్ లో నిలబడితే .. బౌలర్స్ కి ఆ రోజు చుక్కలు కనిపించాల్సిందే. గ్రౌండ్ లోని ప్లేయర్స్ అభిమానులు కావాల్సిందే. ఎందుకంటే .. హిట్ మ్యాన్ ఒక్క సారి తన విజృంభణ ప్రారంభిస్తే .. ఫీల్డర్స్ కన్నా ప్రేక్షకులే ఎక్కువగా బంతి అందుకుంటారు. కెరీర్ గ్రాఫ్‌ను ఒకసారి చూస్తే.. ప్రతి టీ20 మ్యాచ్‌లోనూ తనలోని అసాధారణ ప్రతిభను కనబరుస్తూ, ఈ ఫార్మాట్‌కు ప్రపంచంలోనే విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌లో ఒకరిగా ఆవిర్భవించాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ టీ20ల్లో హయ్యస్ట్ రన్ గెట్టర్.. ఓపెనర్‌గా టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇదొక్కటే కాదు.. ఇలా మరెన్నో రికార్డులు హిట్ మ్యాన్ ఖాతాలో ఉన్నాయి. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ ను అధిగమించి.. టీ20ల్లో హయ్యస్ట్ రన్స్ చేసిన వీరుడు గా అవతరించాడు. టీ20ల్లో భారత్ కు రోహిత్ శర్మ చాలా కీలకమైన ఆటగాడు. అతడు క్రీజులో కుదురుకుంటే, ప్రత్యర్థులు ఔట్ చేయడం చాలా కష్టం. అంతేకాకుండా మూడు వన్డే ద్విశతకాలు కూడా హిట్ మ్యాన్ ఖాతాలో ఉన్న సంగతి తెలిసిందే. క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ వంటి విధ్వంసకర టీ20 ప్లేయర్స్ లిస్ట్‌లో రోహిత్ శర్మ కూడా చేరిపోయాడు. తాజాగా సెర్చ్ ఇంజన్ గూగుల్ కూడా టీ20 లకి నయా గాడ్ హిట్ మ్యాన్ అంటూ తేల్చేసింది.