మూడో కంటికి తెలీకుండా వ్యవహారాల్ని ముగించటంలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ నేర్పు అంతా ఇంతా కాదు. రాజకీయంగా లోగుట్టుగా జరిగే చాలా అంశాలకు సంబంధించిన సమాచారం ఆయనకు ఉంటుందని చెబుతారు. బలమైన నెట్ వర్క్ ఆయనకు ఉందని.. ప్రధాన పార్టీలకు సంబంధించిన లోగుట్లు చాలానే అసద్ కు తెలుసని చెబుతారు. ఈ బలంతోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధం చేసిన ఓటుకు నోటు వ్యవహారాన్ని అసద్ ముందే పసిగట్టి.. కేసీఆర్ ను అలెర్ట్ చేయటం.. ఆ వెంటనే ఆయన అందుకు తగ్గట్లు ప్లాన్ చేయటంతో భారీ గండం నుంచి కేసీఆర్ బయటపడితే.. ఊహించని రీతిలో బాబు పిక్స్ అయ్యారన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉంటుంది.
పక్కాగా ప్లాన్ చేస్తారన్న పేరున్న అసద్.. తాజాగా తన ఇంట్లో జరిగిన రహస్య సమావేశం బయటకు పొక్కటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏ మీడియా దృష్టి సారించని అసద్ ఇంట్లో జరిగే సీక్రెట్ మీటింగ్ బయటకు రావటం వెనుక మరేదైనా వ్యూహం ఉందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అసద్ ఇంట్లో జరిగిన కేటీఆర్..సబిత భేటీని కొన్ని శక్తులు కావాలనే బయటకు వచ్చేలా చేశాయని చెబుతున్నారు. గులాబీ కారులో సబితమ్మ చేరతారన్న మాట ఎప్పటి నుంచో వినిపిస్తున్నా.. అదేమీ జరగని పరిస్థితి. ఇలాంటి వేళ ఈ ఇష్యూను సాగనీయకుండా ఉండేందుకే తాజా భేటీ సమాచారాన్ని బయటకు పొక్కేలా ప్లాన చేశారని చెబుతున్నారు. ఒకవేళ ఇలా లీక్ కావటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటన్న దానికి ఆసక్తికర సమాధానాన్ని చెబుతున్నారు.
సబితమ్మకు కారులో చేరటం పూర్తిగా ఇష్టం లేదని.. కొడుకు ఒత్తిడితో ఆమె ఓకే అనక తప్పటం లేదని.. అయినప్పటికీ ఆమె సందిగ్థతతో ఉన్నారని.. అలాంటి వేళ.. కేటీఆర్ తో భేటీని బయటకు పొక్కటం చేయటం ద్వారా సబితమ్మను ఫిక్స్ చేయటంతో పాటు.. ముందుకు తప్పించి వెనక్కి వెళ్లలేని ఇబ్బందికర పరిస్థితిని సృష్టించి ఉంటారన్న మాట వినిపిస్తుంది. సీక్రెట్ గా ప్లాన్ చేయటంలో అసద్ మొనగాడిగా చెబుతారు. అలాంటిది ఆయన ఇంట్లో జరిగిన రహస్య భేటీ సమాచారం బయటకు రావటమా? అన్న ప్రశ్నను పలువురు ఆసక్తిగా చర్చించుకోవటం కనిపిస్తోంది.