కరోనా వైరస్ రెండేళ్ల నుంచి తన విశ్వరూపం చూపిస్తోంది. చిన్నాపెద్దా తేడా లేకుండా అన్ని దేశాల్లోనూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇకపోతే వేరియంట్ల రూపంలో మహమ్మారి కోరలు చాస్తోంది. డెల్టా వేరియంట్ తో చుక్కలు చూపించిన కొవిడ్... తాజాగా ఒమిక్రాన్ పేరిట పంజా విసురుతోంది.
సౌతాఫ్రికాలో పుట్టిన ఈ వేరియంట్ కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలున్నట్లు వైద్య నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. కాగా మొదటి నుంచి అన్ని దేశాలు అప్రమత్తమవుతూ వస్తున్నాయి. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నా కూడా వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. ఇప్పటికే దాదాపు 106 దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే బూస్టర్ డోసుపై పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
కరోనాను ఎదుర్కొవడానికి వ్యాక్సినేషన్ ఒక్కటే ఉన్నతమైన మార్గం. అందుకే దాదాపు అన్ని దేశాలు టీకా పంపిణీ ప్రక్రియను వేగవంతం చేశాయి. వ్యాక్సినేషన్ శాతం ఎక్కువగా ఉన్న దేశాలు ఏకంగా బూస్టర్ డోసుల ప్రక్రియను కూడా మొదలుపెట్టాయి. ఒమిక్రాన్ విజృంభిస్తున్న వేళ 126 దేశాలు... బూస్టర్ డోసు కోసం సిఫారసులు చేశాయని డబ్ల్యూహెచ్ వో ప్రకటించింది. అందులో 120 దేశాలు ఈ ప్రక్రియను ప్రారంభించాయని వెల్లడించింది. అయితే బూస్టర్ డోసుల వల్ల కరోనాను పూర్తిగా అంతం చేయలేమని స్పష్టం చేసింది. ఏ దేశం కూడా దీని నుంచి ఇప్పటివరకు బయటపడలేదని తేల్చి చెప్పింది.
టీకా తీసుకోని వారే ఎక్కువ మంది వైరస్ బారిన పడే అవకాశం ఉందని... బూస్టర్ డోసు తీసుకున్నవారు కాదు అని వివరించింది. ప్రతిఒక్కరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవడం అవసరం... బూస్టర్ అంత అవసరం లేదని తేల్చి చెప్పింది. బూస్టర్ డోసుల వల్ల కొన్ని దేశాలకు మాత్రమే టీకా సరఫరా అయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఫలితంగా ప్రపంచ దేశాల మధ్య అసమానతలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పేద దేశాల్లో చాలామందికి కనీసం ఒక్క డోసు కూడా దొరకని పరిస్థితి ఉందని చెప్పింది. సంపన్న దేశాల్లో బూస్టర్ డోసులు పంపిణీ చేయడం ఏమాత్రం సరికాదని అభిప్రాయపడింది. టీకా తీసుకోనివారందరికీ కూడా వ్యాక్సిన్ అందేట్లు చేయడానికి ప్రతీ దేశం కృషి చేయాలని ఈ సందర్భంగా పేర్కొంది.
ఒమిక్రాన్ వేరియంట్ వల్ల పాజిటివ్ కేసులు వేగంగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. పైగా క్రిస్మస్ పండుగ సందర్భంగా మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. సెలవుల్లో అనవసరంగా బయట తిరగకుండా ఉండాలని సూచించింది. వైరస్ సోకకుండా పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. ఈమేరకు వరుస ట్వీట్లు చేసింది. కాగా ఒమిక్రాన్ వేరియంట్ మరింతగా విజృంభిస్తే మూడో వేవ్ అనివార్యం అని వైద్య నిపుణులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అందుకే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉండడం ఉత్తమం అని చెబుతున్నారు.